మార్చి నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్

జోసెఫ్ అవినాష్

05 Mar 2026

ప్రపంచంలో పెరుగుతున్న యుద్ధాలు,ఆయుధ పోటీ మధ్య శాంతి కోసం మనమంతా ప్రార్థించాలని విశ్వ కాపరి పోప్ లియో XIV మార్చి నెల ప్రార్థనా ఉద్దేశ్యంలో పిలుపునిచ్చారు. దేవుడు ప్రతి మనిషిని తన స్వరూపంలో సృష్టించాడని,కాబట్టి మనం ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి కాదు సోదరభావంతో జీవించడానికి పిలవబడ్డామని ఆయన గుర్తు చేశారు.దేశాలు ఆయుధాలపై ఆధారపడకుండా సంభాషణ, చర్చలు,రాజనీతిక మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలి అని ఆయన కోరారు.ముఖ్యంగా అణు ఆయుధాల భయం మానవజాతి భవిష్యత్తును నిర్ణయించకుండా ప్రపంచ నాయకులు నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేయాలని పోప్ కోరారు.నిజమైన భద్రత భయంతో కాదు;పరస్పర నమ్మకం,న్యాయం,ఐక్యత ద్వారా మాత్రమే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN