ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావు - పోప్
జోసెఫ్ అవినాష్
04 Mar 2026
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ సమయంలో,విశ్వ కాపరి పోప్ లియో XIV ప్రపంచ నాయకులకు శాంతి సందేశం ఇచ్చారు.ఆయుధాలతో సమస్యలు పరిష్కారం కావని,అవి మరింత రక్తపాతం, విధ్వంసం మాత్రమే తెస్తాయని ఆయన స్పష్టం చేశారు.నిజమైన శాంతి అనేది సంభాషణ,పరస్పర గౌరవం, బాధ్యతాయుతమైన నిర్ణయాల ద్వారానే సాధ్యమని చెప్పారు.దేశాలు శత్రుత్వాన్ని పెంచే మార్గాన్ని విడిచిపెట్టి, చర్చల ద్వారా పరిష్కారాలను వెతకాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రపంచం భయంతో కాకుండా,న్యాయం మరియు సోదరభావంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
