తపస్సుకాల ఆచరణ పునీత అవిలా తెరేసమ్మ మాటల్లో

సిస్టర్ దీప్తి

03 Mar 2026

పునీత అవిలా తెరేసమ్మ గారు తపస్సు కాలపు ఆచరణలోని ఆత్మక్షోభను గురించి ప్రార్థన రూపంలో తెలియజేస్తారు.

"దేవా నా భయాలను గూర్చి,
బలహీనతలను గురించి
ఎందుకు ఆందోళన చెందాలి?
నన్ను బలపరుచుకోడానికి
అవసరమైన వినమ్రతను
నువ్వు నాకు అందజేసి
నీ సాయంతో నేనెంతటి
కార్యాన్నైనా నెరవేర్చగలనను
నమ్మకాన్ని ఏర్పాటు చేస్తావు.
నీ పైన సంపూర్ణంగా ఆధారపడి
జీవించినప్పుడు నేనెంత
బలవంతుడనో నేర్పిస్తావు.
నా ఆత్మ బాధతో పరితపించి
అన్ని వైపుల నుండి కష్టాలను
చవిచూసినప్పుడు వానిని
చూసి కలత చెందవద్దని
నువ్వు నేర్పిస్తావు.ఎంత కష్టం?
ఎంత హింసాత్మకం?
శ్రమలను ఎదుర్కొనడం!
ఈ శ్రమలలో ఎంతో క్షోభ
ఉన్నప్పటికీ ఈ లోక వ్యామోహాలకు
నేను మరణించినప్పుడు
నా ప్రతి ఆవేదన తీరును"

తపస్సుకాలంలో ఈ విధమైన ఆత్మక్షోభ కొందరిలో చోటు చేసుకోవచ్చుఈ క్షోభ ద్వారా భక్తుడు క్రీస్తుతో ఐక్యతనొందే భాగ్యం కలుగుతుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN