నిరాశకు సమాధానం- రూపాంతర క్రీస్తు - పోప్

జోసెఫ్ అవినాష్

02 Mar 2026

తపస్సు కాల రెండవ ఆదివారం సందర్భంగా ఆంజెలస్ సందేశంలో విశ్వ కాపరి పోప్ లియో XIV యేసు దివ్యరూప ధారణ సంఘటనపై లోతైన ఆత్మీయ సందేశం ఇచ్చారు.ఈ రూపాంతరం క్రీస్తు పునరుత్థాన పండుగ వెలుగుకు ముందుమాట అని ఆయన చెప్పారు.మరణం,చీకటి,బాధల మధ్యలో కూడా క్రీస్తు కొత్త వెలుగును ప్రసరింపజేస్తాడు.హింసతో గాయపడినవారికి,బాధతో సిలువ వేయబడినవారికి,నిరాశలో విడిచిపెట్టబడినవారికి ఆయన మహిమ ఆశగా మారుతుంది.యేసుక్రీస్తు రూపాంతరం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది.విమోచకుడు చరిత్ర గాయాలను మహిమగా మార్చి, మన హృదయాలను ప్రకాశింపజేస్తాడు;ఆయన ప్రత్యక్షత రక్షణ వరం.దేవుడు తన కుమారుని ద్వారా నిరాశకు సమాధానం ఇస్తాడు,పరిశుద్ధాత్మ ద్వారా ఒంటరితనాన్ని తొలగించి నిత్య సహవాసాన్ని అందిస్తాడు,బలహీన విశ్వాసానికి భవిష్యత్ పునరుత్థాన వాగ్దానాన్ని ఇస్తాడు.ఈ తపస్సు కాలంలో మౌనంగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ మార్పు పొందమని ఆయన పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN