వీడనట్టి వాడు విజయుడౌను!
.jpg)
డా. కల్లూరి ఆనందరావు
01 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
సర్వ కాలమందు సరియైన మార్గమ్ము
ఎంచుకొనెడి వాని కెదురు లేదు!
నిశ్చయించుకొన్న ఏకైక లక్ష్యమ్ము
వీడనట్టి వాడు విజయుడౌను!
