నేటి పునీతుడు: పునీత చాద్ (క్రీ.శ. 634 - 672)

ఫాదర్ ఆకుల ప్రసాద్
01 Mar 2026
సుగుణం: 'వినమ్రశీలి'
పునీత చాద్ గారిని చీద్దా అనికూడా పిలుస్తారు.వీరు ఇంగ్లాండులోని ఉత్తర ఉంబ్రియానందు 7వ శతాబ్దంలో జన్మించారు. వీరు ఫెర్ను నందలి పునీత అయిదానుగారి వద్ద విద్యనుపొంది బెనెడిక్టు సభలో చేరి గురువుగా అభిషక్తులైయ్యారు.చాద్ గారు ఐర్లాండు వెళ్ళి పునీత 'ఎగ్ బర్డు' గారితో కలసి 'రాత్ మెల్సిగి' ప్రాంతంలో సువార్తా సేవ చేశారు.తన అన్నగారైన లండన్ పీఠాధిపతులైన చెద్ గారి కోరికపై చాద్ గారు ఇంగ్లాండుకు తిరిగివచ్చి లాస్టింగుహోము మఠాలయానికి అధిపతిగా సేవచేశారు. ఇంగ్లాండు రాజైన ఓస్వే గారు చాద్ గార్ని యార్కుషైరు పీఠానికి అధిపతిని చేశాడు. కానీ సరియైన సాంగ్యముల కొరత వల్ల అది చెల్లదని కాట్రంబరి అగ్రపీఠాధిపతియైన పునీత థియోడోరుగారు ప్రకటించారు. చాద్ గారు వినమ్రతతో అగ్రపీఠాధిపతుల ఆజ్ఞను అంగీకరించి ఇట్టి గొప్పపదవికి తాను అనర్హుడనని ఒప్పుకొని దానిని పరిత్యజించారు.చాద్ గారి ఔన్నత్యానికి, సౌశీల్యతకు సంతృప్తిచెందిన థియోడోరుగారు స్వయంగా తానే చాద్ గారిని మెర్శియా పీఠానికి పీఠాధిపతిగా అభిషేకించారు. చాద్ గారు 'లీక్ ఫీల్డ్' కేంద్రంగా తన మేత్రాసనాన్ని క్రీస్తు పరిచర్యలో ముందుకు నడిపించారు. వీరు 31 దేవాలయాలను నిర్మించి శ్రీసభకు అంకితంచేశారు. లీక్ ఫీల్డ్ లోని బార్డ్నే మఠాలయాన్ని స్థాపించిన వీరు క్రీ.శ. 672లో ఆ మఠాలయంలోనే పరలోకప్రాప్తినొందారు.
పునీత చాద్ గారా మాకొరకు ప్రార్థించండి!
