క్రీస్తులో జీవిద్దాం

జోసెఫ్ అవినాష్

27 Feb 2026

తప:కాల 1వ శనివారం
ద్వితీ 26:16-19
కీర్తన 119:1-2, 4-5, 7-8
మత్తయి 5:43-48
ధ్యానం:
ఫ్యాషన్ పరిశ్రమను గమనించినచో వివిధ రంగులలో, శైలిలో దుస్తులను ఆవిష్కరిస్తూ వాటిని మార్కెట్ నందు ప్రవేశ పెట్టుటకు సినిమా తారలను వాణిజ్య ప్రకటనలలో వాడుకొనుట మనకు తెలుసు.ఈ ప్రక్రియలో పరిపూర్ణతకు దర్పణం పడుతూ వినియోగదారులను,వారి తారల ప్రకటనల ద్వారా ఆకర్షిస్తుంటారు.రేమండ్ దుస్తుల పరిశ్రమ దుకాణముల ముందు “ద కంప్లీట్ మ్యాన్ పరిపూర్ణ మగాడు” అనే ట్యాగ్ ను వాడుతూ,వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లుగా వారి ఉత్పత్తులను పరిచయం చేస్తుంటారు.నేటి సువిశేషమునందు యేసు పలికిన చివరి వాక్యము "పరలోక మందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరును పరిపూర్ణులగుడు," మనకు మన విశ్వాస జీవిత ఆవశ్యకతను ప్రస్ఫుటం చేస్తూ, శిష్యరికపు ప్రయాణములను అమాంతం పెంచుతుంది. మరి మన ఆధ్యాత్మిక జీవితులో పరిపూర్ణతను ఏ విధముగా పొందగలము? మన అలవాట్లు దినచర్యలు,ప్రయత్నములు కేవలము మన లాభమును మాత్రము కోరుకొనక,సువిశేషంలో యేసు పలికినట్లు ఇతరులు,మరీ ముఖ్యముగా మన శత్రువుల కొరకు ప్రార్థించుటలో వారిని ప్రేమించుటలో ఇమిడి ఉంది. క్రైస్తవ శిష్యరిక లక్షణములను కేవలము దైనందిన కార్యములకే పరిమితం చేయక, యేసు వాటిని పెంచుతూ,సిలువ మార్గమును మనకు చూపుచున్నాడు.తద్వారా తండ్రి దేవుని ప్రేమయందు మననల స్థిరపరుస్తూ,భూలోకమందు మనము చేయు కార్యములు పరలోకమందున్న మన తండ్రి దేవుని పరిపూర్ణతను పొందునట్లు తయారు చేయుచున్నాడు.ఈ ప్రయాణములో మన విశ్వాస ప్రకటన,జీవితము కేవలము జిలుగు వెలుగు వలె ఉండక గట్టి, పునాది యందు నిర్మించుకొనుటకు శాయశక్తులా కృషి చేయాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN