ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైస్తవ సమావేశం

జోసెఫ్ అవినాష్
27 Feb 2026
నెల్లూరు ఇస్కాన్ సిటీలో ఉన్న జీసస్ సెంటర్ నందు "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య" ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రైస్తవ సమావేశము క్రైస్తవ ఐక్యత సేవ విభాగ కార్యదర్శి రెవ ఫాదర్ అంతయ్య అధ్యక్షతన జరిగింది.సుమారు 200 మంది వివిధ క్రైస్తవ సంఘాలకు చెందిన చర్చి పాస్టర్స్ మరియు నాయకులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మన నెల్లూరు పీఠాధిపతులు మహా పూజ్య ప్రకాశం తండ్రి గారు,సహ పీఠాధిపతులు మహా పూజ్య అంతోని దాస్ గార్లు పాల్గొని నేటి దినాలలో క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత ఎంతో అవసరం అని,దాని కొరకు ప్రతీ క్రైస్తవుడు,క్రైస్తవ సంఘము కృషి చేయాలని పిలుపునిచ్చారు.నెల్లూరు జిల్లా క్రైస్తవ నాయకులు రెవ రాజశేఖర్ దాసరి, రెవ దయాసాగర్, రెవ బెనహుర్ బాబు, లెఫ్టెంట్ కల్నల్ జోసెఫ్, రెవ ప్రేమ్ కుమార్, రెవ పీటర్ పాల్ ,ఫాదర్ జోసెఫ్, క్రైస్తవ నాయకులు డా. సురేంద్ర బాబు,బ్రదర్ బర్నబాస్లు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించారు.విజయవాడ నుండి విచ్చేసిన రెవ ఫాదర్ ప్రసాద్,రెవ కరుణానిధి లతో పాటుగా రెవ జోసెఫ్ బాబు, రెవ జెర్మీయ,రెవ ప్రభుకుమార్,రెవ బాలసుందరంలు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు. నెల్లూరు పీఠాధిపతులు మహా పూజ్య ప్రకాశం తండ్రి ఆశీర్వాదం తో సమావేశం ముగిసింది.
