నేటి పునీతుడు: పునీత గాబ్రియేల్ ఆఫ్ పొస్సెంతి

ఫాదర్ ఆకుల ప్రసాద్

26 Feb 2026

సుగుణం: "మరియ వ్యాకులత భక్తుడు"

గాబ్రియేల్ పొస్సెంతి గారు క్రీ.శ. 1838లో ఇటలీలోని అస్సిస్సినందు జన్మించారు.వీరి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్ పొస్సెంతి. వీరి తండ్రి స్పోలెట్ నగరంలో పేరుమోసిన జడ్జి. చిన్ననాడే తల్లిని కోల్పోయిన గాబ్రియేల్ గారు తండ్రి సంరక్షణలో పెరిగారు.వీరికి రెండుసార్లు జబ్బుచేయగా, తనకు వ్యాధినయమైతే తనజీవితాన్ని దైవసేవకు అంకితం చేస్తానని మరియతల్లికి మాట ఇచ్చాడు. కానీ వ్యాధినయమైన పిదప తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా వాయిదా వేస్తూ ఇంటి ఆర్థిక విషయాల్లో మునిగిపోయాడు. క్రీ.శ.1856లో తమను భయంకరమైన కలరా వ్యాధినుండి కాపాడినందులకు కృతజ్ఞతగా ప్రజలు వ్యాకులమాత స్వరూపంనూ ఊరేగిస్తుండగా మరియతల్లి గాబ్రియేల్ గారితో 'ఫ్రాన్సిస్,ఇంకా ఎందుకు ఆలస్యం,త్వరగా మఠవాస జీవితం ప్రారంభించు' అంటూ తను ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఆయన చెవిలో చెప్పింది.మరియతల్లి వ్యాకులతలో పాలుపంచుకోవాలనే తపనతో వ్యాకులమాత సభలోt passionist congregation) చేరి మరియతల్లికి శుభసందేశానందించిన గాబ్రియేల్ దూత పేరును క్రీ.శ. 1856లో ధరించారు.తనను తాను వ్యాకులమాతకు అంకితంచేసుకొని గాబ్రియేలు బ్రదరుగా ప్రఖ్యాతిచెందారు. వీరు మఠవాసజీవితంలో అడుగిన 6సం! రాలకే పెద్దవ్రణంవల్ల మంచానపడి గురువుగా అభిషేకం పొందకుండానే కేవలం తన 14వ ఏటనే క్రీ. శ. 1862లో 'ఐసోలా ది గ్రాన్సుస్సో నందు పరలోకప్రాప్తిచెంది తమ సభ ప్రార్థనామందిరంలోనే సమాధిచేయబడ్డారు. క్రీ.శ. 1920లో 15వ బెనడిక్టు పోపుగారు గాబ్రియేల్ గారిని పునీతులుగా ప్రకటించారు.గురువు అవ్వాలనే తన కోరిక తీరకముందే యుక్తవయస్సులోనే మరణించిన గాబ్రియేల్ గారు యువ మఠవాసులకు, బ్రదర్లకు పాలకపునీతుడు.

పునీత గాబ్రియేల్ ఆఫ్ పొస్సెంతి గారా మాకొరకు ప్రార్ధించండి!

బంగారు మాట:
నా గుండెలో దైవప్రేమకు వ్యతిరేఖంగా
ఏది అడ్డుపడినా దానిని
వ్రేళ్లతో సహ పెకిలించివేస్తాను.
(పునీత గాబ్రియేల్ ఆఫ్ పొస్సెంతి)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN