తపస్సుకాల ఆచరణ పునీత ఫిలిప్ నేరీ మాటల్లో

సిస్టర్ దీప్తి

26 Feb 2026

ఇటలీ దేశంలో తండోప తండాలుగా ఉన్న పునీతులలో, చాలా వరకు విచార వదనంతో, కఠోర దీక్ష తపస్సు మార్గాలను పాటిస్తూ చాలా గంభీరంగా కనిపించేవారు.అందుకనే చాలా మంది పునీతులు అవ్వాలంటే భయపడటానికి కారణం ఈ కఠోరత్వం, గాంభీర్యం.అయితే ఫిలిప్పు నేరి మాత్రం తన సమకాలీన పునీతులకు భిన్నంగా జోరుగా హుషారుగా ఉండేవారు. ఆయన గురువు అని ప్రజలు మర్చిపోయి ఎంతో ఉల్లాసంగా, అతృతగా ఈ ఋషి కోసం ఎదురు చూసేవారు. ఈయన జీవితం ఓ చూడముచ్చటైన చలనచిత్రంలా ఉండేదట. తపస్సుకాలంలో వీరు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ఎప్పుడూ చూడని అపరిచిత వ్యక్తుల దగ్గరకు పోయి సంభాషించేవారు.మన కాలంలో అలాంటి వారిని పిచ్చోడు అని అంటాం. కానీ ఈయన వారితో దైవప్రేమ గురించి సంభాషించేవారు. దాని తర్వాత ఇటలీ దేశంలో ప్రఖ్యాతి గాంచిన పునీతుల భూగర్భ సమాధులు (సెయింట్ సెబాస్టియన్ కాటకూంబ్స్) దగ్గర రాత్రులు ప్రార్ధనలో గడిపే వారట.

మనం ఇలా అపరిచితులతో మాట్లాడటం.మనకి ఇబ్బందులు తెవచ్చు, ఎందుకంటే మనం పునీతులం కాదు కదా! కాబట్టి తపో:కాలంలో రోజుకు ఒక వ్యక్తితో దైవ ప్రేమ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎవరికైతే సంభాషణలు సులభమో, వారు ప్రత్యేక శ్రద్ధతో ఓ అపరిచిత వ్యక్తికి చైన ప్రేమ సంభాషణను అందించవచ్చు లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గోనవచ్చు లేదా మన మార్గంలో ఎదురయ్యే వాని చిరునవ్వుతో పలకరించవచ్చు. వీటి తర్వాత ఓ జపమాలతోనో, లేదా రాత్రి కాల ప్రార్థనతోనో మన ఆచరణను సంపూర్ణం చేయవచ్చు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN