తలుపు వెలుపల యేసుప్రభువు చిత్రపటం- భావం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

26 Feb 2026

ఒక చిత్రంలో తెలుపు వెలుపలు నిలబడి తలుపు తడుతున్న యేసుక్రీస్తును చూసే ఉంటారు.చిత్రకారునికి ఈ ఊహ ఎలా వచ్చిందోనని ఆశ్చర్యపోతారు.అందుకు దైవగ్రంథమే ఆధారం. ఈ చిత్రాన్ని విలియం హోల్ మన్ హంట్ అనే చిత్రకారుడు 1865 సం॥లో ప్రారంభించి 1904||సం లో పూర్తి చేశాడు.మూడు దశలుగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం చివరికి లండన్లోని సెయింట్ పాల్స్ కథీడ్రల్ ల్లో అమర్చబడింది.

ఈ చిత్రంలో తలుపు దగ్గర నిలుచున్న క్రీస్తు తలుపుతడుతూ శ్రద్ధగా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు ఉంటుంది. తలుపు దగ్గర కలుపు మొక్కలు విరివిగా కనుపిస్తాయి.ఈ తలుపు భక్తుని జీవితాన్ని సూచిస్తుంది.అప్పటికే ప్రభువును తెలుసుకొన్న భక్తుడు తన జీవితంలో ఆయనకు స్థానం ఇవ్వడం లేదని ఆ పరిసరాలు సూచిస్తాయి.కలుపు మొక్కలు భక్తి హీనతను తెలియచేస్తాయి.బయట నిలుచున్న క్రీస్తు తలుపు తడుతూ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఊహించుకోవచ్చు.ఈ తలుపుకు గొళ్ళెం బయటకు కనుపించదు.చిత్రకారుడు దీనికి ఒక వివరణ ఇచ్చాడు. ఉద్దేశపూర్వకంగానే గొళ్ళెం లోపలికి అమర్చాడు.ఈ తలుపు లోపలి వారే తీయగలరు అనే అర్ధం ఇక్కడ స్ఫురిస్తోంది.ఇలా చిత్రించినట్లు చిత్రకారుడే చెప్పుకొన్నారు.అందుకే అది మూసివేయబడిన హృదయానికి ప్రతీక. భక్తుడు మాత్రమే దానిని తెరిచి ప్రభువును ఆహ్వానించగలడు.ఆయన బలవంతంగా ప్రవేశింపడు.ఎమ్మావున్ సంఘటనలో కూడా తనను పిలిచిన తరువాతే ఆయన వారితో కలసి భోజనం చేస్తాడు (లూకా 24).తలుపు తెరవటం అన్నది దైవసాన్నిహిత్యాన్ని ఆహ్వానించినట్లుగా అర్ధం చేసుకోవాలి.ఈ సందర్భంలో దర్శన గ్రంధంలోని ఈ వాక్యాలను స్ఫురణకు తెచ్చుకోవాలి."వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను.ఎవరైనను,నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును.అతడు. నాతో భుజించును"(దర్శన 3:20) భోజనము హార్ధిక స్వాగతానికి, స్నేహానికి గురుతు.ఇలా మూసిన తలుపులు మనుషుల మధ్య దూరానికి, తెరచిన తలుపులు హార్దిక కలయికకు అననాలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN