సమాజాన్ని బాగు చేసే కాలం - తపో కాలం

జోసెఫ్ అవినాష్
26 Feb 2026
ఈ తపస్సు కాలాన్ని సామాజిక బాధ్యతతో జీవించాలని కతోలిక శ్రీసభ ఆధ్వర్యంలో నడిపించబడుతున్న కారిటాస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ప్రత్యేక పిలుపునిచ్చింది.సమాజంలో పెరుగుతున్న అసమానతలు, పేదల అణచివేత,అలాగే ప్రకృతి నాశనం వల్ల ప్రజల జీవితం కష్టమవుతున్న ఈ సమయంలో తపస్సు కాలం కేవలం వ్యక్తిగత ప్రార్థనకు మాత్రమే కాకుండా,సమాజం మరియు సృష్టి పట్ల జవాబుదారీతనంతో జీవించే సమయమని గుర్తుచేసింది.నీటి కొరత,వనరుల అసమాన పంపిణీ, జీవనాధారాల కోల్పోవడం వంటి సమస్యలు సామాజిక అన్యాయాన్ని మరింత పెంచుతున్నాయని చెబుతూ,ఈ తపస్సు కాలంలో పేదలతో సంఘీభావం చూపడం,ప్రకృతిని కాపాడడం,సమానమైన జీవన అవకాశాల కోసం కృషి చేయడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక మార్పు సాధ్యమని ఈ ప్రచారం సందేశం ఇస్తోంది.
