వాడని పుష్పం సిస్టర్ రాణి మరియ

సిస్టర్ ఉష

24 Feb 2026

ధర్మార్ధము హింసితులు ధన్యులు దైవరాజ్యము వారిది.(మత్తయి 5:10)

ప్రతి మతంలో మల్లె, గులాబీ తామర బంతి పువ్వు వంటి పువ్వులు పూజలో వాడతారు పూజల్లో పువ్వులను సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు కొన్ని రకాల పుష్పాలు పూజలో పవిత్రమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. కొన్ని రకాల పూలు పూజకు పనికిరావు వాటిని ఇతర కార్యక్రమాలకు వాడతారు. పూజలో సమర్పించిన పువ్వులు పవిత్రంగా చూడటం జరుగుతుంది. దేవుడి పూజకు అర్పించుకున్న జీవితం అనే పుష్పం ధన్యమైనది అది ఎల్లప్పుడూ దైవ సన్నిధిలో నిగనిగల ఆడుతూ మహోన్నతుడైన దేవుని స్తుతి ఆరాధన చేస్తుంది ప్రకృతి దేవుని ఆరాధిస్తున్నట్లుగా ఆగుపడుతూ ఉంటుంది. అటువంటి కోవకు చెందిన ధన్యమైన పుష్పమే సిస్టర్ రాణి మరియా పరలోక సంపదతో నింపుకున్న ఆమె జీవితం ప్రశంసనీయం విజయాన్ని సాధించడానికి జీవితాన్నే పణంగా పెట్టిన గొప్ప కన్యాస్త్రీగా అనాధలకు అభాగ్యులకు చేయూతనిచ్చి వారిని అందరిలో ఒకటిగా చేసిన ఘనత వారికే దక్కుతుంది.

ఏ కార్యాన్ని సాధించాలన్న ఆమెలో ఉన్న పట్టుదల ఒక కారణం అది లేకపోతే అసలు విజయమే రాదు ఏ పనిని సాధించాలన్న బలమైన కోరిక భగవంతునిపై ఉండాలి దైవాన్ని తలంచుకుంటూ తన భారాన్ని ప్రభువైన ఏసుక్రీస్తుపై మోపింది ఆమెలో కోరిక ఎంత దృఢంగా ఉందో విజయం కూడా అంత తేలిక అయింది దైవం పై బలమైన కోరిక ఉన్న వారిని ఇతరులు ఆపలేరు వాళ్లు తమంతట తామే పనికి పూనుకుంటారు తాము కోరుకున్న కార్యాన్ని సాధించేదాకా నిద్రపోరు విజయాన్ని సాధించాలి అనే వాళ్లలో మరో గుణం అంకిత భావం రాని మరియ గారికి అంకితభావం ఒక బంగారు ఆభరణంగా భావించాలి ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి ఓ కార్యానికి పూనుకునేవారు ఇక అహోరాత్రులు ఆ పనిలోనే నిమగ్నమై ఉండేవారు కన్నుమూసిన కన్ను తెరిచిన అభాగ్యుల జీవితాలు ఆమె చేయవలసిన కార్యాలు కళ్ళకు కట్టినట్లు కనిపించేవి అదే ధ్యాస అదే శ్వాసగా అను దినం ఆమె జీవించేది కుమ్మరి మట్టితో తనకు నచ్చిన పాత్రను తయారు చేస్తాడు అలాగే రాణి మరి తన జీవితాన్ని కూడా తనకు నచ్చిన రీతిలో మలుచుకుని దేవుడి మెచ్చిన మార్గంలో నడిచింది ఆమె అనేకమందిని ప్రభువు వైపు నడిపిస్తుంది ఆమె జీవితం ఒక వాడని పుష్పం వంటిది దేవుని పాదాలు చెంత నిండైన హృదయంతో అర్పించారు ప్రథమ భారత మహిళగా వేదసాక్షి ధన్య రాణి మరియ మనందరి హృదయాల్లో గూడుకట్టుకున్నారన్నది ఆశ్చర్య తరం. ఆమె కేరళ రాష్ట్రంలోనే కొచ్చిన్ ప్రాంతంలో ఫుల్లు వెళ్లి అనే ప్రాంతంలో జన్మించడం ద్వారా భారత గడ్డ ధన్యమైంది ఆమె బాల్యం నుండే దైవభక్తిలో నిమగ్నమై ఉండేది వినయ విధేయ ఆభరణాలుగా ధరించింది విశ్వాసమునే నిలువెల్లా ధరించింది. 1966వ సంవత్సరంలో ప్రధమ దివ్య సత్ప్రసాదం, భద్రమైన అభ్యాంగాన్ని తన సొంత ఊరిలో అంటే ఫుల్లు వెళ్లిలో స్వీకరించడం జరిగింది రాణి మరియా గారి విద్యాభ్యాసం ఒక ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది అనుదినం దివ్య బలి పూజలలో పాల్గొనటం సాయంత్రం వేళల్లో జపమాల చెప్పటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య రాని మరియ గారు ఆటల్లో పాటల్లో చాలా చురుగ్గా ఉండేవారు చదువుతోపాటు ఇంటి పనులు చాలా చక్కగా చేస్తూ ఉండేవారు సమయం దొరికినప్పుడు తల్లిదండ్రులకు సాయం చేయటం ఆనవాయితీగా అవలంబించేవారు రాని మరి ఉన్నత పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించటం వల్ల ఆమెను ఇంకా పై చదువులు చదివించాలని ఆ మా తండ్రి తిప్పల యారు అనే ప్రాంతంలో కన్యా స్త్రీలు నడిపిస్తున్న పునీత జోసఫ్ గారి కళాశాల యందు చేర్పించారు అక్కడ కన్యాస్త్రీల జీవితం ఎంతగానో ఆమెను ఆకర్షించింది. తోటి కన్య స్త్రీల ధర్మకత్వంలో అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నారు ప్రార్థన జీవితంలో ఎదిగారు ఆ కళాశాలలో చదివి అక్కడే వారి జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకున్నారు దైవ పిలుపును అందుకొని కన్యాస్త్రీగా జీవితాన్ని జీవించుటకు సిద్ధమయ్యారు ఈ విషయాన్ని తన బంధువు మరియా చెల్లి అయిన సిసిలియాతో పంచుకున్నారు ఆమె కూడా మేరీ తో కలిసి ఫ్రాన్సిస్ కన్ క్లారా సభలో చేరాలని నిర్ణయించుకున్నారు వేసవి సెలవుల్లో తను కన్యాస్త్రి కావాలనే తలంపును మేరీ తన తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు తెలియజేశారు తన తోబుట్టువులు అందరూ కూడా మేరీ కన్యశ్రీ కావటం ఇష్టం లేదని నిరుత్సాహపరిచారు వీరి తండ్రి అమ్మమ్మ గారు మాత్రం దేవుని పిలుపు అందరికీ రాదు కదా ఆమెను ఆపటానికి మనం ఎవ్వరం అంటూ మేరీ నిర్ణయాన్ని సమర్థించారు.

మేరీ ని ప్రత్యేకంగా అభినందిస్తూ దీవించి 1972 సంవత్సరంలో పునీత ఫ్రాన్సిస్ కన్ క్లారిస్ట్ సభలో చేర్పించారు మరియా ప్రాథమిక శిక్షణ తర్వాత నోవిషేట్ లో 19 73 సంవత్సరంలో అడుగు పెట్టారు లోకా నాలుగు 18 చెప్పబడినట్లు ప్రభువాత్మ నాపై ఉంది పేదలకు శుభవార్త ప్రకటించడానికి బందీలకు విముక్తిని గుడ్డివారికి చూపును ప్రకటించడానికి మరియు అనిచి వేయబడిన వారికి విముక్తి కల్పించడానికి ఆయన నన్ను అభిషేకించెను అన్న ప్రభువుని మాటలు మేరీని ఎంతగానో ఆకట్టుకున్నాయి మే 1న 1974లో అంగమలి దేవాలయంలో రాణి మరి అనే పేరుతో క్లారిస్ట్ సభలో కన్యాస్త్రీగా అర్హతను స్వీకరించారు మూడవ మాట పట్టు ద్వారా తనను తాను సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకున్నారు ఉత్తర భారత దేశంలో పేదల మధ్య పని చేస్తున్న మటకన్యల జీవితాలు రాని మరియాను ఎంతగానో ఆకట్టుకున్నాయి తాను కూడా ఉత్తరావనిలో తన సేవలను అందించుటకు తన ఆశయాలను తెలుపుతూ తన మఠం పెద్దలకు ఒక లెటర్ రాశారు ఆ సమయంలో బిచ్చినూరు పీఠాధిపతులు ఇద్దరు కన్యా స్త్రీలను పంపించవలసిందిగా ఎర్నాకులంలోని సభ అధిపతులకు ఉత్తరం రాశారు దాని కోసమే సిస్టర్ రాని మరియాను మరియు సిస్టర్ అన్న జనులను ఎంపిక చేశారు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు రాణి మరి తన ఇష్టపూర్వకంగా ప్రభు ద్రాక్ష తోటలో పనిచేయుటకు నిర్ణయించుకున్నారని కుటుంబ సభ్యులు వారికి వీడ్కోలు తెలియజేశారు ఉత్తరప్రదేశ్లోని బిచ్చనూరులోని పునీత మరియమ్మ గారి మఠంలో చేరుకున్నారు ఆ ప్రాంతంలో మారుమూల ప్రాంతాలకు వెళ్లి పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ కల్పించి ఎంతో ప్రేమగా చదవడం రాయడం నేర్పించారు బీడు భూముల్లో పశువుల కాపలా బాలికల దగ్గరకు వెళ్లి వారికి చదవడం వ్రాయటం నేర్పించారు. సేవా కార్యక్రమాలు అందించారు దిగనూరు గ్రామంలో ఒక ప్రాంతంలో ఎనిమిది సంవత్సరాల పాటు గ్రామీణ ప్రజలతోనూ వ్యవసాయ కూలీలతోనూ ఎడతెగక పనిచేశారు దైవ బలంతో ఇన్ని మంచి పనులు చేయగలిగానని భయపడవలదు నేను నీకు తోడై ఉన్నాను అనే ప్రభుని మాటలు అను దినం రాని మరియ గారిని ప్రోత్సహిస్తూ ఉండేవి 1982 రాని మరియ గారు చివరి మాట పట్టు స్వీకరించారు . సామాజిక శాస్త్రాన్ని చదివి పట్టాను సాధించారు పలు బృందాలుగా ప్రజలను ఏర్పాటు చేసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని మెరుగుపరిచారు బ్యాంకులో రుణాలు పొందునట్లు వీడు భూముల్లో బావులు తృవించారు నీటి పొదుపును వారికి నేర్పించి నీటి సదుపాయం ఏర్పాటు చేశారు మహిళా మండలి ఏర్పాటు చేసి బ్యాంకుల్లో రుణాలను పొందునట్లు కృషి చేశారు నిలబడి చేస్తున్న మంచి పనులు అక్కడ ధనికుల వర్గానికి కన్నెర్రగా మారాయి ప్రజలలో మతమార్పిడి చేస్తున్నట్లు భావించి బ్యాంకుల్లో రుణాలను ఇవ్వడం ఆపివేశారు నిందలు ఆరోపణలు చేశారు బ్యాంకులో రుణాల దరఖాస్తులను తిరస్కరిస్తూ వచ్చారు. అది తెలుసుకొని ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి వారు ఎంతగానో బ్రతిమాలాడారు పేదల పక్షపాతిగా ఉన్న రాణి మరియ గారు ఎంతగానో కృషి చేశారు నిరుపేదల్లో క్రీస్తును వారి మాటల్లో వారికి వివరించారు రాని మరియ గారు సామాజిక శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొంది అందు మెలకువలను గ్రహించారు సార్ధకతతో సేవలు చేస్తూ వచ్చారు ఊరు గిడ్డిలో 9 సంవత్సరముల పాటు సేవలందించి బదిలీ మీద మే 16 1992 ఇండోర్ పీఠంలో ఉన్నటువంటి ఉదయ్ నగర్ చేరుకున్నారు అప్పటి అనేక బృందాలను అభివృద్ధికి పాటుపడిన రాని మరియ గారు మరొకసారి గిరిజనుల పట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు విద్యార్థులను ఉన్నత చదువులకు పంపించారు యువతీ యువకులను మహిళలను చిన్నచిన్న సంఘాలుగా ఏర్పాటు చేసి తమ కాళ్ళపై తమ నిలబడినట్లు ఎంతో గొప్పగా కృషి చేశారు అక్కడి గిరిజనుల జీవితాలను మెరుగుపరచాలని వారి కోసం గోనె సంచులు కొట్టడం సాంబ్రాణి పుల్లలు తయారు చేయడం గొర్రెల పెంపకం తేనె సేకరించటం భూములను సేద్యం చేయించటం విద్య గురించి పొదుపు గురించి వివరించారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం మొదలుపెట్టారు అమ్మల అమృతమూర్తిల ప్రజలను ఆదుకున్నారు గిరిజనుల జీవితాల్లో పెను మార్పులు సంభవించాయి భూస్వాముల ఇళ్లల్లో పెట్టి చాకిరి మానివేశారు. చిన్నచిన్న వ్యాపారాలు చేపట్టారు పొదుపు చేయటం మొదలుపెట్టారు రాణి మరి ఒక తల్లిలా సోదరిలా ఎంతగానో ప్రజల హృదయాలు దోచుకున్నారు ప్రజల భవిష్యత్తులో మమేకమైపోయారు పట్టుమని పాతికేళ్లు నిండని రాని మరి ప్రభువు ఇచ్చే రక్షణలో సంతోషించారు గాని మటన్ పెద్దలు ఇచ్చే పదవుల కోసం ప్రాకులాడలేదు ఇదంతా మింగుడు పడని ఉదయపూర్ చెందిన ధనికుడు జీవన్ సింగ్ రానీ మర్యాద గారి మంచి పనులు సేవా తత్పరతను చూసి కన్నెర చేశాడు గిరిజలలో జరిగిన మార్పులు ఎంతగానో వారిని అనగా ధనవంతులను కలవరపెట్టాయి ఆమె కన్నులు నలుసులా మారిందని భావించారు ఆమెను హతమార్చాలని అవకాశం కోసం ఎదురు చూశారు వారు అనుకున్న సమయం రానే వచ్చింది కానీ మరియ గారు కేరళ వెళ్తున్నానని తెలిసి పక్కా ప్లాన్ వేశారు ఆనాడు రాని మరియ గారు ఉదయాన్నే లేచి ప్రార్థనలు ముగించుకొని బయలుదేరారు అది ఫిబ్రవరి 25 1995 ఆరోజే ఆమె బయలుదేరి బస్సు వద్దకు వెళ్లారు. బస్సు కిక్కిరిసిపోయి ఉన్నందున సిస్టర్ గారు బస్సు వెనక్కి వెళ్లి కూర్చున్నారు పరిచయం ఉన్న వ్యక్తులు మధ్య కూర్చున్నారు ముగ్గురు మగవారు వెనక సీట్లలో కూర్చున్నారు వారిలో జీవన్ సింగ్ కూడా ఉన్నాడు అతనితో మరో ముగ్గురు ఉన్నారు వారే తనను హత్య చేస్తున్నారని ఆమెకు తెలియదు వారిలో ఒక వ్యక్తి సుమంధర్ సింగ్ దిగి కొబ్బరికాయ కొట్టి ఆ ముక్కలను అందరికీ పంచారు అదేవిధంగా రాణి మరియా గారికి కూడా ఇచ్చారు. కానీ కొబ్బరికాయ ముక్కలు ఇస్తున్నట్లు సిస్టర్ గారిని ఆటపట్టించారు అది చూసిన జీవన్ సింగ్ మరో యువకుడు హేళనగా నవ్వారు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారని రానీ మరియా గారు వారిని అడిగారు ఇదిగో ఇందుకే నేను సంతోషంగా ఉన్నానని కత్తితో కానీ మరి ఆ పొట్టలో పొడిచారు. యేసువా అని గట్టిగా ఏడ్చారు ప్రయాణికులు పారిపోయారు ఒకరిద్దరు వారిని ఆపాలని ప్రయాణికుల సహాయం చేశారు కానీ ఫలితం లేదు రాని మరియ గారికి తెలిసింది జీవంశం ఇంకా పొడవు ఇంకా పొడవు అంటూ అరిచాడు సుమన్దర్ సింగ్ రాని మరియ గారిని 50 సార్లు పొట్టలో పొడిచి ఆమె ముఖమును గాయపరిచారు యేసువా యేసువా అంటూ మరణించారు.

రాణి మరియ గారి భౌతిక దేహాన్ని ఇండోర్ కేథడ్రలకు తీసుకువచ్చి జార్జీ పీఠాధిపతులు దివ్య బల్లి పూజను సమర్పించారు ఫిబ్రవరి 27 1995న ఉదయ నగర్ నందలి మీర్జాపూర్ నందలి తిరుహూదయ దేవాలయమున పూజా బలిన అర్పించారు దాదాపు 1200 మంది ఆ దివ్య బలి పూజలో పాల్గొని రాణి మరి ఆత్మ శాంతి కోసం ప్రార్థించారు ఉత్తర భారత దేశంలో ఎంతో వేరోచితంగా బడుగు వర్గాల కోసం పాటుబడిన రాణి మరియు ఉత్తమ మహిళగా రక్తం చిందించి వేదసాక్షిగా మరణించారు సిస్టర్ అని మరియ గారి వేదసాక్షి మరణాన్ని కేరళలోని చిరు మలబార్ క్రైస్తవులు ఎంతగానో ప్రశంసించారు 50 సార్లు పొడిచిన సుమన్ నర్సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆమె పునీత పట్టా 2003లో మొదలైంది ఆమెను 29 జూన్ 2005 దైవ సేవకులుగా పరిగణించారు నవంబర్ 4 2017న ఫ్రాన్సిస్ జగద్గురువులు ధన్యులుగా పరిగణించారు సిస్టర్ అని మరియా గారిని 50 సార్లు పొడిపించిన జీవన్ సింగ్ను జైలు నుంచి విడిచిపెట్టి అతనికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులు క్షమించి గౌరవించారు ఇంకా కొద్ది రోజుల్లో ఆమెను మనం పునీతురాలిగా చూడబోతున్న రాని మరియ మద్యస్థ ప్రార్ధన ద్వారా దేవుని దీవెనలు పొందుదాం పునీతపట్ట కోసం ప్రార్థిద్దాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN