తపస్సుకాల ఆచరణ పునీత 2వ జాన్ పాల్ మాటల్లో

సిస్టర్ దీప్తి
24 Feb 2026
మన కాలంలో జీవించిన ఈ పునీతుల గురించి మరొక పరిచయం అవసరం లేదు.అయితే వీరు తపస్సు కాలంలో పైన సూచించిన పద్దతిని అనుసరించే వారట. "మనకు అవసరం లేని వస్తువులను ఇవ్వడం చాల సులువు కానీ మనకి అవసరం అని, మన చెంత వుంచుకున్న వస్తువులను ఇవ్వడమే కదా నిజమైన త్యాగం, ఎలా అయితే పేద వితంతువు తన దగ్గరున్న సమస్తాన్ని "ప్రభువే తనకు ఇచ్చిన ఉచిత వరం" అని గుర్తించి ఎలా తిరిగి ఆయనకి సమర్పించినదో అదే నమ్మకంతో మనం కూడా అవసరమైన వస్తువులని సైతం త్యాగం చేయగలగాలి" అని పోపుగారు అన్నారు. నిజమే మరి ఇహలోక సంపదలు మంచివే కానీ, గురుత్వాకర్షణ శక్తిలా అవి మనల్ని సశ్వర విషయాల వైపే గుంజుతాయి. మరి స్వర్గాకర్షణ శక్తి పనిచేయాలంటే, ఐహిక వస్తువులు వదలక తప్పదు కదా! కేవలం క్రీస్తు కోసం! క్రీస్తేగా మరి మన గొప్ప సంపద!
