గురువులు పదునైన ప్రసంగాలు వ్రాయాలి :పోప్

జోసెఫ్ అవినాష్

24 Feb 2026

ఇటీవల రోమ్ నగర పరిసర ప్రాంత దైవాంకితులతో సమావేశమైన పోప్ వారితో ముచ్చటించారు.దివ్యబలిపూజలో బోధించే ప్రసంగాన్ని కృత్రిమ మేధస్సు(AI),ఇంటర్నెట్ పై ఆధారపడకుండా, దేవుడిచ్చిన జ్ఞానంతో,సొంత ఆలోచనలతో,ప్రార్థనా అనుభవం,దేవునితో ఉన్న వ్యక్తిగత సంబంధం నుండి ప్రసంగాలు తయారు చేసుకోవాలని ఆయన గురువులను కోరారు.శరీరానికి వ్యాయామం అవసరమైనట్లే,బుద్ధికి కూడా సాధన అవసరమని ఆయన స్పష్టం చేశారు.ప్రసంగం కేవలం పదాల సమాహారం కాదు;అది గురువు విశ్వాస జీవితం నుంచి వెలువడే సాక్ష్యం కావాలి అని ఆయన అన్నారు.అలాగే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం కాకుండా,తగ్గింపు స్వభావముతో,పరిపూర్ణ సేవ దృక్పథంతో దైవ సేవ చేయాలని ఆయన గురువులను కోరారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN