నేటి పునీతుడు: పునీత జాన్ తెరిస్టస్

ఫాదర్ ఆకుల ప్రసాద్

23 Feb 2026

సుగుణం: “పంటల సంరక్షకుడు"

జాన్ తెరిస్టస్ గారు క్రీ.శ.1049లో ఎమిరేట్ ఆఫ్ సిసిలీలోని పలెర్మోనందు జన్మించారు.వీరి తండ్రి ముస్లింల దండయాత్రలో మరణించగా వీరి తల్లి ముస్లింలచే బందీగా సిసిలీకి కొనిపోబడింది.జాన్ గారు ఇస్లామిక్ వాతావరణంలో పెరిగిననూ కాలేబ్రియాన్ వంశస్తురాలైన వారి తల్లి ఆయనను క్రైస్తవ విశ్వాసంలో పెంచింది.తన తల్లి సహాయంతో జాన్ గారు ముస్లింలనుండి తప్పించుకొని తన సొంత ప్రాంతమైన కాలేబ్రియాకు చేరుకొన్నారు.అక్కడ బెనెడిక్టియన్ సన్యాసుల జీవితం ఎడల ఆకర్శింపబడి, ఆంబ్రోస్ మరియు నికోలస్ గార్ల సుమాతృకను అనుసరించి బెనెడిక్టియన్ సన్యాసిగా తన జీవితాన్ని క్రీస్తు సువార్తకు అంకితం చేశాడు.పవిత్రమూర్తియైన జాన్ గారిని దేవుడు తన అద్భుతాలను చేయుటకు వినియోగించుకున్నాడు.ఒకసారి కోతకు వచ్చిన విస్తారమైన పంటను భయంకరమైన తుఫానునుండి కాపాడి ప్రజలను ఆకలి కరువునుండి కాపాడినాడు.అందుకే ఆయనను జాన్ హార్వెస్ట్ అని కూడా పిలుస్తారు.కరువుకాటకాల సమయంలో మరియు పంటలు తెగుళ్ళ ద్వారా నాశనమయ్యే సమయంలో వీరిని ప్రార్థించినచో మంచిజరుగుతుంది.జాన్ హార్వెస్ట్ గారు 1129లో సాధారణ మరణాన్ని పొందారు.

పునీత జాన్ తెరిస్టస్ గారా మాకొరకు ప్రార్థించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN