తపస్సుకాల ఆచరణ పునీత అగస్టిన్ మాటల్లో

సిస్టర్ దీప్తి
23 Feb 2026
పాపంలో కొట్టు మిట్టాడుతున్న మనకు పునీత అగస్టిన్ వారు గొప్ప ఉపశమనం కదా! ఈ పునీతునికి వీరాభిమానులు ఎక్కువే! అయితే వీరు తపస్సుకాలంలో చేసిన కార్యం, తాను నొప్పించిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరడం,శత్రువుల కోసం ప్రార్ధించడం. "ఈ రెండు పనులు చేయాలంటే గుండెల్లో దమ్ముందాలి మరి! క్రీస్తుని ప్రేమ, వినయం ఒక మనిషి ఆత్మలో ఎంతగా నిండి ఉంటే ఈ ఉన్నత ఆలోచన తట్టుతుందో! ఇక ఆలస్యం చేయకుండా, దైర్యంతో, మనం గాయపరచిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుదాం మన శుత్రువుల కోసం ప్రార్ధించుదాం! వాళ్ల మనసును గాయపరచిన పొరపాటు మనదే కదా! కాబట్టి క్షమాపణ అడుగుదాం! ప్రభు సంతోషిస్తారు.
