నిండైన ప్రార్థనా జీవితాన్ని జీవిద్దాం

జోసెఫ్ అవినాష్

23 Feb 2026

తప:కాల 1వ మంగళవారం
యెషయా 55:10-11
కీర్తన 34:4-5,6-7,16-17,18-19
మత్తయి 6:7-15
ధ్యానం:
ఒక విషయము లేదా అంశము గురించి పరిజ్ఞానం పెంచుకోవాలను కొంటే, తెలుసుకోవాలనుకుంటే కేవలము దానికి సంబంధించిన ప్రమాణములు మాత్రమే కాకుండా,ఇతర అంశములను కూడా గ్రహించాలి.మన ఆధ్యాత్మిక జీవితములో ఎదుగుదలకు తోడ్పడు అలవాట్లను తెలుసుకొని అభివృద్ధి చెందగోరినచో,అందుకు వ్యతిరేఖమైన,తోడ్పడని దృక్పధములను చాకచక్యముతో ఎరిగి,భిన్నమైన,ఆరోగ్యకరమైన పద్దతులు పాటించాలి.నేటి సువిశేషమునందు యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయు విధమును పరిచయం చేస్తూ, ఎట్లు ప్రార్థించవలెనో,దేని గురించి ప్రార్ధించవలెనో తెలియచేస్తూ, ప్రార్ధన జీవితమునందు ఎవరి పద్దతులను,పోకడలను అరికట్టవలెనో బోధించారు.

పరలోక ప్రార్థనను బోధిస్తూ, యేసు మన ప్రార్థనా జీవితమును కేవలము ఒక దినచర్యగా మాత్రమే పరిగణింపక తండ్రి దేవునితో ఒక దృఢ సంబంధమును ఏర్పరచుకొను వారిధిగా మలచుకొనవలయునని ఆహ్వానిస్తున్నారు.కేవలము మన అవసరముల కొరకు మాత్రమే ప్రార్థనను వినియోగించక, పాపమన్నింపును పొందుటకు, ఇతరులను క్షమించుటకు విరివిగా వాడుకొనమని బోధిస్తున్నాడు. అన్యులవలె పదజాలమును విశృంఖలముగా వాడకుండా, ప్రార్థనను ఒక హృదయ భావన వలె పరిగణించమని,తద్వారా మన జీవితమునే ఓ ప్రార్ధన ప్రయాణముగా,పరంపరగా సాగించమని కోరుతున్నాడు. తపస్సుకాల దీక్షయందు మన ఆధ్యాత్మిక జీవితమునకు ముఖ్య పునాది వంటి ప్రార్ధనను మనము ఎలా పరిగణిస్తున్నాము? దైనందిన జీవితములో ప్రార్ధనను కొరచి కొరచి చేయక, నిండు మనస్సుతో పాల్గొనమని తద్వారా తండ్రి దేవుని ప్రేమ సంగమములో మిళితమవ్వమని పిలుస్తున్నాడు. మరి అటువంటి నిండైన ప్రార్థనా జీవితమును జీవించగలమా?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN