దేవుని స్వరాన్ని ఆలకిద్దాం - పోప్
జోసెఫ్ అవినాష్
23 Feb 2026
తపస్సు కాలం అంటే కేవలం ఆచారాలు పాటించే సమయం మాత్రమే కాదు;అది మన జీవితాన్ని దేవుని కృపతో మళ్లీ మలచుకునే పవిత్రమైన అవకాశమని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ అన్నారు.యేసు అరణ్యంలో ఎదుర్కొన్న శోధనలను గుర్తుచేస్తూ, సైతాను శోధనలను ఎలా ఎదుర్కోవాలో క్రీస్తు మనకు నేర్పిస్తున్నారని ప్రార్థనా శక్తితో సైతానును తరిమికొట్టాలని ఆయన తెలియపరిచారు.మనమూ ప్రార్థన,ఉపవాసం,దానం ద్వారా మనసును శుద్ధి చేసుకోవాలని పిలిచారు.దేవుడు మన జీవితాన్ని ఒక “అద్వితీయ కళాఖండం”గా మార్చాలనుకుంటున్నాడని ఆయన స్పష్టం చేశారు.కొంతసేపైనా టీవీ, ఫోన్ వంటి వాటిని పక్కనపెట్టి నిశ్శబ్దంలో దేవుని స్వరాన్ని వినాలని సూచించారు.అలాగే వృద్ధులు,పేదలు,బాధపడుతున్న వారిని మరువకుండా వారితో సానుభూతి,సహాయం పంచుకోవాలని ప్రోత్సహించారు.ఈ తపస్సుకాల ప్రయాణాన్ని దేవమాత ఆశ్రయానికి అప్పగించాలని చెప్పారు.
