తపస్సుకాల ఆచరణ పునీత ఫౌస్టినా మాటల్లో

సిస్టర్ దీప్తి
22 Feb 2026
అనారోగ్య కారణంగా ఫౌస్టినా కఠోరమైన తపస్సుకాల ఆచరణలను చేపట్టలేక పోయేది.కానీ ఆమె తపస్సు కాలం చేసిన ప్రతి చిన్న త్యాగం కేవలం తనను తాను కష్టపెట్టుకోడానికి కాకుండా తాను పొందిన ప్రతి చిన్న శ్రమ ద్వారా పాపుల మనస్సులు మారాలని, తానూ క్రీస్తుని ఇంకా అధికంగా ప్రేమించడానికి ఉపకరించాలని ఆశించేది. తపస్సు కాలంలో ఎక్కువగా దివ్య కారుణ్య జపమాలను జపిస్తూ పాపుల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించేది.ఈ విధంగా తపస్సుకాల ఆచరణలలో దివ్య కారుణ్య జపమాల ప్రాముఖ్యతను గూర్చి బోధించింది.
తపస్సు కాలంలో చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం లేదా ధర్మకార్యం క్రీస్తుకు మరింత చేరువయ్యే విధంగా ఉండి అతని శ్రమలలో పాలుపంచుకొనే విధంగా ఉండాలి గాని అది ఒక వ్యక్తి కేవలం తన ఆత్మ సంతృప్తి కోసం చేసినదై ఉండకూడదు. స్వలాభాపేక్ష కొద్దీ చేయడంలో తపస్సుకాల అర్ధాన్ని కోల్పోతాం.. తపస్సుకాలపు ప్రతి చర్య క్రీస్తుని కేంద్రమై చేసినప్పుడు అర్థం,పరమార్ధం చేకూరుతుంది.ఆ విధమైన ఆచరణాల ద్వారా మనం పునీతుల ఆదర్శాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక జీవన పరిపూర్ణతలో ఎదుగుదాం. క్రీస్తు అందించే ఉత్థాన ఫలాలను కైవసం చేసుకొనే ప్రయత్నం చేద్దాం
