వాటికన్ లో వినూత్న రీతిలో సిలువ మార్గ ధ్యానం
జోసెఫ్ అవినాష్
21 Feb 2026
తపస్సు కాలాన్ని పురస్కరించుకొని వాటికన్ లోని పునీత పేతురు మహాదేవాలయ ఆవరణలో వినూత్న రీతిలో సిలువ మార్గ ధ్యానాన్ని నిర్వహించారు.14 స్థలాలు క్రీస్తు శ్రమలను ప్రతిబింబిస్తూ విశ్వాసులను ప్రార్థన, ధ్యానంలోకి నడిపిస్తాయి.క్రీస్తు బాధామయమైన సిలువ మార్గాన్ని అనుసరిస్తూ స్విస్ కళాకారుడు Manuel Andreas Dürr రూపకల్పన చేసిన చిత్రపటాలను వాటికన్ లో ప్రదర్శించారు. ఈ చిత్రపటాలు క్రీస్తు శ్రమలు,మరణ- పునరుత్థాన ఘట్టాలను స్ఫూర్తిదాయకంగా ప్రతిబింబించాయి.ఫిబ్రవరి 20 శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో ఎంతో మంది విశ్వాసులు పాల్గొని ఈ చిత్రపటాలను వీక్షించి,సిలువ మార్గాన్ని ధ్యానించారు.ఈ చిత్రపటాలు కతోలిక విశ్వాసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
