శ్రీసభ మన కుటుంబం - పోప్
జోసెఫ్ అవినాష్
18 Feb 2026
చర్చి అంటే కేవలం భవనం కాదని,దేవుడు మనందరినీ తన దగ్గరకు తీసుకురావడానికి ఏర్పాటు చేసిన కుటుంబమని జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ అన్నారు.దేవుడు మనుషుల్ని విడదీయడానికి కాదు,కలిపేందుకు వచ్చాడని,క్రీస్తు ద్వారా అందరినీ ఒక్కటిగా చేయాలనేది దేవుని కోరికని. ఆ కలిసే చోటే చర్చి.మనమంతా ప్రార్థనలో,పూజాబలిలో కలిసి కూర్చుంటే ధనవంతుడు, పేదవాడు,చదువుకున్నవాడు, చదవనివాడు అన్న తేడాలు ఉండవు.అందరం దేవుని పిల్లలమే.చర్చి అనేది దేవుని ప్రేమను, ప్రత్యక్షతను మన కళ్ళకు కట్టినట్టుగా చూపే పవిత్రమైన స్థలమని,విభజనలతో నిండిన ఈ ప్రపంచంలో ఐక్యతను నిర్మించడమే దేవుడు శ్రీసభకు అప్పగించిన కర్తవ్యం అని పోప్ తెలియపరిచారు.
