ఆత్మ ఫలించే అనుగ్రహ కాలం- తపస్సు కాలం

ఎడిటర్
17 Feb 2026
తపస్సు కాలంలో కొందరు దీక్షబూనుతారు.మరికొందరు 40 రోజులు కఠోరమైన ఉపవాసం చేస్తూ శాఖాహారాన్ని భుజిస్తారు.ఇంకొందరు తపస్కాలమంతా ఉదయం అల్పాహారం తీసుకోరు. ధూమపానం,మద్యపానానికి దూరంగా ఉంటారు.కొందరు గడ్డం కూడా పెంచుకుంటారు. ఊదా రంగు వస్త్రాలను ధరిస్తారు.ఇవన్నీ ప్రోత్సహించ, ప్రశంసించదగిన విషయాలే. కానీ నటనకు చిహ్నాలుగా ఉండకూడదు.ఇదే వసంతకాలం,కృపాకాలం, ధ్యానకాలం,నవ జీవన ఋతువు.కానీ యెషయా ప్రవక్త ద్వారా మన తపస్సుకు, ఉపవాస క్రియలకు నిజమైన అర్థం పరమార్థం దేవుడు తెలియజేసాడు.
- మన పాపాలను, తప్పిదాలను తెలుసుకోవాలి. పాపసంకీర్తనం చేయాలి.
- మనం ఉపవాసం ఉండడం మన తృప్తి కోసం కాదు. నిజమైన ఉపవాసం అంటే పనివారిని పీడింపకుండా ఉండడం. తగవులు పెట్టుకోకుండా ఉండడం.
-శారీరక, ఆధ్యాత్మిక బందీలను విముక్తి చేయడం.
- ఉపవాసం ఉండే వారి ముఖాలు ప్రాతఃకాల సూర్యుని వలె వెలుగొందుతుండాలి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.ఆశ్రయంలేని వారికి ఆశ్రయమవ్వాలి.తపస్కాలం సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని కోరుకోవాలి.ప్రతిరోజూ ఈ కోవకు చెందిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నిస్తే మనం చేపట్టిన ఉపవాస ధర్మానికి అర్ధం,పరమార్ధం ఉంటుంది.
