తెలుగు క్రైస్తవ సంఘాల ఐక్య వేదికలో భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)

16 Feb 2026

ఫిబ్రవరి 16, 2026న జ్యోతిర్మయి కేంద్రంలో తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య సమావేశం మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు (నెల్లూరు సహ పీఠాధిపతి)మరియు ఇతర పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో 2025 సంవత్సరంలో నిర్వహించిన కార్యక్రమాలు,సాధించిన విజయాలు మరియు ఎదురైన సవాళ్లపై విపులంగా చర్చించారు. క్రిస్టియన్ ఫైనాన్స్ చైర్మన్ దీపక్ జాన్ గౌడ్ గారు మాట్లాడుతూ,క్రైస్తవులకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన వివిధ సంక్షేమ పథకాలు,వాటిని పొందే విధానం మరియు సంఘాల పాత్ర గురించి స్పష్టంగా వివరించారు.క్రైస్తవ సమాజం హక్కులు మరియు అవకాశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.అలాగే,2026 సంవత్సరంలో చేపట్టబోయే కార్యక్రమాలు,సేవా ప్రణాళికలు మరియు సంఘాల ఐక్యతను బలపరచే చర్యలపై సవివరంగా చర్చించారు.కార్యక్రమమంతటిని తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య,క్రైస్తవ ఐక్యత సేవ విభాగ కార్యదర్శి గురు శ్రీ కొండవీటి అంతయ్య గారు పర్యవేక్షించారు.సమావేశం సంఘాల ఐక్యతను మరింత బలపరిచే దిశగా ఆశాజనకంగా ముగిసింది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN