నేటి పునీతుడు: పునీత ఒనేసిమస్

ఫాదర్ ఆకుల ప్రసాద్

15 Feb 2026

సుగుణం: "పౌలు అభిమానం పొందిన క్రీస్తు సేవకుడు”

అన్యుడైన ఒనేసిమస్ గారు ఫిలెమోను వద్ద బానిసగా సేవచేసేవాడు.పునీత పౌలుగారు సువార్తనిమిత్తం టర్కీలోని ఎఫేసు నగరానికి వచ్చినప్పుడు ఫిలేమోను క్రీస్తును రక్షకునిగా అంగీకరించి జ్ఞానస్నానం స్వీకరించి పౌలుగారికి మంచి మిత్రుడైనాడు.ఎఫేసునుండి కొలెస్సే నగరానికి తన నివాసం మార్చిన ఫిలేమోను అక్కడ తన గృహాన్ని క్రైస్తవులందరికి ప్రార్థనాస్థలంగా ఉపయోగించేవాడు.ఫిలెమోను చెంత సేవచేసే ఒనేసిమాస్ గారు ఒకసారి తెలియక ఒకచిన్న పొరపాటు చేసి,యాజమాని శిక్షిస్తాడేమో అన్నభాయంతో రోముకు పారిపోయి అక్కడ పౌలుగారిని కలుసుకొని క్రీస్తును స్వీకరించాడు.అదేసమయంలో పౌలుగారికి మొదటిసారి కారాగార శిక్షపడగా, ప్రత్యేక అనుమతితో ఒక అద్దె ఇంట్లో నిర్భందంలో ఉంటూ సందర్శకులకు పౌలుగారు క్రీస్తును బోధించేవారు.పౌలుగారికి ఒనేసిమస్ గారు ఒత్తాసు బాలునిగా సేవచేసేవాడు.అతని సేవకు ముగ్ధులైన పౌలుగారు ఒనేసిమస్ గారిని సహాయకునిగా నియమించుకుంటూ అతని మొదటియజమానియైన ఫిలేమోనుకు ఉత్తరం వ్రాసి అతనినుండి ఒనేసిమస్ క్షమాపణపొందేలాచేశాడు. ఒనేసిమస్ గారు పౌలుగారితో కలిసి తూర్పుదేశాలలో సువార్తను ప్రకటించారు.ఒనేసిమస్ గారు మాసేడోనియాలోని చెర్ హూయా పీఠాధిపతిగా సేవలందించినట్లు చరిత్ర వెల్లడిస్తుంది.తర్వాత కొంతకాలానికి క్రైస్తవులపై సాగిన దారుణ హింసాకాండలో ఒనేసిమస్ గారు క్రీ.శ.90లో వేదసాక్షిగా మరణించారు.

పునీత ఒనేసిమస్ గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN