యేసునందు అత్యున్నత ప్రేమ చిహ్నమును కనుగొందాం

Father gopu praveen

15 Feb 2026

సామాన్య 6వ సోమవారం
యాకోబు 1:1-11
కీర్తన 119:67, 68, 71, 72, 75, 76
మార్కు 8:11-13
ధ్యానం:
దేవుడు ఆబేలు అర్పణను స్వీకరించి,కయీను కానుకను తృణీకరించెను.బహుశా,అర్పణ సమయములో కయీను ప్రదర్శించిన ప్రవర్తన మరియు కానుక యొక్క శ్రేణి దేవుని ఆమోద యోగ్యతను పొందలేదు. మనము అర్పించు కానుకలు కేవలము నాణ్యతను మాత్రమే కలిగి ఉండక,మన హృదయ భావములను దేవునికి ప్రీతి పాత్రముగా ఉండునట్లు చూసుకొనవలెను.నేటి సువిశేషము నందు పరిస్యయులు కయీనును పోలిన ప్రవర్తనను, హృదయ భావనను కలిగి ఉండగా,వారు యేసును “చిహ్నము” కొరకు అడిగినపుడు, వారి హృదయ కాఠిణ్యమును ఎరిగి, తనదైన శైలిలో జవాబిచ్చెను.వివిధ సందర్భములందు గుర్తులను, చిహ్నములను చూపుమని అడిగిన పరిస్యయ్యులు, యేసునందు,యేసు చేసిన పరిచర్యలో దేవుని ఉనికిని గ్రహించుటలో దారి తప్పిరి. తద్వారా,వారి తప్పులను తెలుసుకొనక,హృదయ పరివర్తనను పొందలేకపోయిరి.

ప్రతి యుగములో కేవలం మానవ శాస్త్రములు, నూతన ఆవిష్కరణల యందు మాత్రమే మన దృష్టిని ఉంచినచో, బహుశా పరిసయ్యులు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక సంధిగ్ధతను మనము కూడా ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తును. ఎందుకనగా, భౌతిక చిహ్నములందే మన ఆసక్తిని లగ్నము చేసినచో మన విశ్వాసమునకు తగినంత స్పందనము ఇచ్చుటలో చొరవ చూపజాలము. కేవలము తర్కమును, ఆధారముగా చేసుకొని జీవించినచో, దైవరాజ్య తీరు తెన్నులను గ్రహించలేము. మన రక్షకుడైన యేసు, పాపమును మినహాయించి ప్రతి మానవ అనుభవమును, పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఒకవేళ ఇప్పటికీ మన హృదయములు యేసు అందించు అత్యున్నత ప్రేమ ఆహ్వానమునకు స్పందించుటలో ఆసక్తి చూపనిచో, బహుశా మన హృదయములకు కావలసిన మన్నింపును దయచేయమని తండ్రి దేవుని ప్రార్థించుదాం, యేసునందు అత్యున్నత ప్రేమ చిహ్నమును కనుగొందాం.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN