నేటి పునీతుడు: పునీత వలెంటైను

ఫాదర్ ఆకుల ప్రసాద్

14 Feb 2026

సుగుణం: “ప్రేమాసహృదయుడు"

ప్రేమికుల పాలకపునీతులైన వలెంటైను గారు క్రీ.శ.226లో ఇటలీలోని టేర్నినందు జన్మించారు."ప్రతి మనిషిని ప్రేమించాలి,ప్రతి మనిషి ప్రేమించబడాలి,ఇదే క్రీస్తు ప్రేమసిద్ధాంతం" అని గట్టిగా నమ్మిన వీరు, క్రీస్తు ప్రేమ మానవులందరి రక్షణకు ప్రతీక కావాలని ఆశించారు.3వ శతాబ్దంలో రోమా చక్రవర్తియైన 2వ క్లౌడియసు క్రైస్తవులను అనేక వేదహింసలకు గురిచేసేవాడు.రాజుచే పట్టుబడిన క్రైస్తవులను వలెంటైను గారు అనేక ఉపాయ మార్గాలద్వారా తప్పిస్తూ వారు పారిపోయేలా చేసేవారు.తానే చెరసాలకు వెళ్ళి వారికి గురుసేవలు మరియు వైద్యసేవలు చేసేవాడు. ప్రజలను సైనికులుగామార్చు నిమిత్తం క్లౌడియసు చక్రవర్తి వివాహాలను రద్దుచేయగా,దానిని వ్యతిరేకిస్తూ వాలైంటైను గారు రహస్యంగా యువజంటలకు వివాహాలు జరిపించేవారు.అలా లెక్కలేనంతమందికి ప్రేమతో ఆయన సేవలందించారు. క్రైస్తవ గురువైన వలెంటైను గారు క్రైస్తవులను రక్షిస్తూ వారిని క్రీస్తునందు బలపరచడం తేలిసిన క్రైస్తవ వ్యతిరేకులు క్రీ.శ. 269 ఫిబ్రవరి 14న రోమునందు ఆయనను దుడ్డుకర్రలతో మోది, తలనరికి చంపారు. వీరిని ప్రేమతో అభిమానించే క్రైస్తవులు, వీరిని రోమునగరానికి అరమైలు దూరంలో నగర ప్రధాన ద్వారం దగ్గరలో సమాధిచేసి తరచూ ప్రార్థనలు చేసేవారు.4వ శతాబ్ధంలో 1వ జూలియన్ పోపుగారు వలెంటైను సమాధివున్నస్థలంలో ఒక భూగర్భదేవాలయాన్ని నిర్మించాడు,దానిని 7వ శతాబ్దంలో 1వ హోనోరియసు పోపుగారు పునరుద్దరించారు.పెండ్లి చేసుకోవడానికి నిశ్చయింపబడిన యువజంటల పాలక పునీతులుగా వలెంటైను గారిని శ్రీసభ ఏర్పరచింది.వీరి పండుగరోజున అనగా ఫిబ్రవరి 14న "వలెంటైనుడే" గా పేర్కొంటు ప్రేమిక జంటలు ఒకరికొకరు ప్రేమతో గ్రీటింగ్ కార్డులు, బహుమానాలు అందించుకుంటారు.వలైంటైన్ అనగా దృఢమైన,ఆరోగ్యకరమైన అని అర్థం.

పునీత వాలైంటైను గారా మాకొరకు ప్రార్ధించండి!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN