తప:కాలం మన జీవితాలను మార్చే కృపాకాలం -పోప్

జోసెఫ్ అవినాష్

13 Feb 2026

విశ్వకాపరి పోప్ లియో రానున్న తపస్సుకాల సందేశాన్ని విడుదల చేశారు,ఈ పవిత్ర సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన అపూర్వమైన కృపా కాలంగా అభివర్ణించారు. ఉపవాసం అంటే కేవలం ఆహార నియమాలు పాటించడం మాత్రమే కాదని;మన హృదయం మారాలి,మన మాటలు మారాలి,మన జీవన విధానం మారాలని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.విభూది బుధవారం నుండి ప్రారంభమయ్యే ఈ తపస్సు కాలం,మనలో దాగి ఉన్న గర్వం,ద్వేషం,విమర్శ స్వభావాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగే ఆత్మపరిశుద్ధి సమయమని ఆయన గుర్తుచేశారు.“మన మాటలను నిరాయుధం చేసుకుందాం” అని పిలుపునిచ్చిన పోప్,నాలుక ద్వారా గాయపరిచే మాటలు,వెనుక మాటలు, ఆవేశపూరిత వ్యాఖ్యలు,సామాజిక మాధ్యమాల్లో ద్వేషభరిత స్పందనలు ఇవన్నీ క్రీస్తు శిష్యునికి తగవని హెచ్చరించారు.

నిజమైన ఉపవాసం అనేది కేవలం భోజనాన్ని తగ్గించడం మాత్రమే కాదు;మన మాటలలోని కఠినత్వాన్ని, మనసులోని కక్షను,అసూయను తొలగించడం కూడా ఒక ఆత్మీయ త్యాగమేనని ఆయన వివరించారు.బాధపడుతున్నవారిని ఆదరించడం,పేదల పట్ల కరుణ చూపించడం,ఒంటరితనంలో ఉన్నవారికి తోడుగా నిలవడం ఇవే తపస్సుకాలంలో నిజమైన ఆత్మపరిశీలన ఫలితాలని ఆయన స్పష్టం చేశారు.కుటుంబాల్లో,సంఘాల్లో,సమాజంలో శాంతి నెలకొనాలంటే మన మాటల్లో ప్రేమ,గౌరవం,క్షమాభావం ప్రతిఫలించాలి అని ఆయన బోధించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN