ఘనంగా జరిగిన గుణదలమాత మహోత్సవాలు

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
13 Feb 2026
ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో విజయవాడ పీఠానికి చెందిన గుణదల లూర్దుమాత మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆశీర్వాదమయ వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.వేలాది మంది భక్తులు పాల్గొని మరియతల్లి దీవెనలు పొందుకున్నారు.
ఫిబ్రవరి 9న, కడప పీఠాధిపతులు మహా పూజ్య సగినాల పాల్ ప్రకాష్ గారు ప్రధానార్చకులుగా దివ్యపూజాబలిని సమర్పించారు.వారి ఆత్మీయ సందేశం భక్తుల హృదయాలను స్పృశించింది.
ఫిబ్రవరి 10న,విశాఖ అగ్ర పీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు ప్రధానార్చకులుగా, పలువురు గురువులతో కలిసి ఘనంగా దివ్యపూజాబలిని సమర్పించారు.ఆరాధనలో పాల్గొన్న ప్రజలు ప్రార్థనలో లీనమయ్యారు.
మహోత్సవాల చివరి రోజు ఫిబ్రవరి 11న, విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు అనేకమంది గురువులతో కలిసి మహోత్సవ పూజాబలిని భక్తి ప్రపత్తులతో సమర్పించారు.పూజ అనంతరం తమ పీఠాధిపత్యంలోని 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రాజారావు తండ్రిగారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భారతమిత్రం సంపాదకులు గురుశ్రీ చల్ల డేవిడ్ గారు ‘భారతమిత్రం’ పత్రిక సేవలను భక్తులకు పరిచయం చేస్తూ, కతోలిక సాహిత్య ప్రచారంలో దాని ప్రాముఖ్యతను వివరించారు.మొత్తం మహోత్సవాలు భక్తి, ఐక్యత, ఆనందాలతో నిండిపోయి, మరియమాత ఆశీర్వాదాలతో విజయవంతంగా ముగిశాయి.
