లూర్దుమాత పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
11 Feb 2026
కొండ కొసన లూర్దు! కొండపై గుణదల!
అమ్మ కొలువు యున్న ఆలయములు!
కోర్కెల నెఱవేర్చ కోటి మ్రొక్కులు మొక్కు
జనులు ఆశ్రయించు జనని మరియ!
ఎల్ల వారిని గని చల్లగా దీవించు
మరియమాత మనకు మార్గదర్శి!
లోక మాయ జిక్కి శోకార్తులగు వారి
గుండెలోన యేసు గుడిని కట్టు!
మోకరించు వారి మోమున ప్రభు శక్తి
చిలకరించు నట్టి దేవమాత!
మమ్ము బ్రోవవమ్మ! మనుజ సుతుని తల్లి!
శరణమంటి! నీదు చరణమంటి!.
