బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు-పోప్
జోసెఫ్ అవినాష్
11 Feb 2026
దేవుడు మానవులతో సంభాషణ ఆపలేదు.ఈ రోజుకీ ఆయన మనతో మాట్లాడుతూనే ఉన్నారు.ఆ దివ్య స్వరం మనకు వినిపించే స్థలం పవిత్ర గ్రంథం అని పోప్ జనరల్ ఆడియన్స్ సందర్భంగా స్పష్టం చేశారు.బైబిల్ అనేది ఆకాశం నుండి పడిపోయిన గ్రంథం కాదు.పవిత్రాత్మ ప్రేరణతో మనుషుల చేత వ్రాయించబడిన దేవుని వాక్యం.అందుకే అది కేవలం చరిత్ర పుస్తకం కాదు జీవించి, మన జీవితాలను మారుస్తున్న దేవుని సందేశం.మనలను అపారంగా ప్రేమించే తండ్రి అయిన దేవుడు, మనం అర్థం చేసుకునే భాషలోనే తన రక్షణ సందేశాన్ని అందించారు.అయితే బైబిల్ చదివేటప్పుడు తొందరపడి,మనకు నచ్చిన అర్థం తీయకూడదని పోప్ హెచ్చరించారు.అది వ్రాయబడిన కాలం,పరిస్థితులు, సంస్కృతి అన్నిటినీ గమనిస్తూ చదవాలని సూచించారు.ప్రత్యేకంగా ప్రార్థనతో చదివినప్పుడు మాత్రమే ఆ వాక్యం మన హృదయాన్ని తాకుతుంది.ఎందుకంటే బైబిల్ కేవలం చదవడానికి ఉన్న గ్రంథం కాదు,జీవించడానికి ఇచ్చిన వాక్యం. అది మన బాధలో ఆదరణ,అయోమయంలో దారి చూపే వెలుగు, నిరాశలో ఆశ నింపే శక్తి.ప్రతి పవిత్ర బలిపూజలో దేవుని వాక్యం వినబడినప్పుడు,అది సాధారణ పఠనం కాదు ఆ క్షణంలో క్రీస్తే మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్న సమయం అని పోప్ గుర్తుచేశారు.
