మన గాయాలన్నీ సువార్త వెలుగులో మాన్పబడతాయి - పోప్

జోసెఫ్ అవినాష్

09 Feb 2026

మన జీవితాల్లో ఎన్ని బలహీనతలు, గాయాలు, విఫలాలు ఉన్నా దేవుడు మనలను ఎప్పటికీ పక్కన పెట్టడు అని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.యేసుప్రభువు చెప్పిన “ఉప్పు, వెలుగు” ఉపమానాన్ని వివరిస్తూ,క్రైస్తవులు కేవలం మాటలతో కాదు జీవిన విధానంతోను సాక్ష్యమివ్వాలి అని పోప్ తెలిపారు.మన ప్రేమ, సేవ,త్యాగ జీవితం ద్వారా ఈ లోకానికి వెలుగుగా నిలవాలని పిలుపునిచ్చారు.ఈ ప్రపంచం పనికిరానివారిగా పరిగణించే వారిని కూడా దేవుడు ఎంతో విలువైనవారిగా చూస్తాడని,మన గాయాలన్నీ సువార్త వెలుగులో మాన్పబడతాయని ఆయన భరోసా ఇచ్చారు.పేదలకు అన్నం పంచటం,ఇల్లు లేనివారిని ఆదుకోవటం, అవసరంలో ఉన్నవారిని పట్టించుకోవటం వంటి చిన్న పనులే లోకాన్ని మారుస్తాయని,అవే నిజమైన క్రైస్తవ సాక్ష్యమని పోప్ లియో XIV అన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN