క్రీస్తుతో కలిసి నడుద్దాం

Father gopu praveen

08 Feb 2026

సామాన్య 5వ సోమవారం
1రాజులు 8:1-7,9-13
కీర్తన 132:6-7,8-10
మార్కు 7:1-13
ధ్యానం:
సర్వసృష్టి దేవుని ఘనతను, మంచితనమును వెల్లడి చేస్తుంది. విశ్వమును సృజించిన దేవుని దృష్టిలో అంతయూ "బాగుగా, సుందరంగా ఉండెను." మన చుట్టూ ఉన్న సహజవనరులు, ప్రాణుల ద్వారా మనము దేవుని మంచి తనమును,ఔదార్యమును అనుభవించగల్గుచున్నాము.మరి ముఖ్యముగా,దైవ వాక్కు ద్వారా, వాక్కు మానవ రూపమైన యెడల దేవుని ఉనికిని,ముఖకాంతిని మనము చూడగల్గుచున్నాము. మూడు సంవత్సరములుగా యేసు చేసిన పరిచర్య ద్వారా ప్రజలు దేవుని స్వస్థతను,సమాధానమును నిండుగా పొంది పావనం చెందిరి. నేటి సువిశేషమునందు మార్కు సువార్తీకుడు చెప్పిన విధముగా, "జనులు పలు ప్రాంతముల నుండి యేసు వద్దకు వచ్చి అతనిని తాకగా స్వస్థులైరి."అట్టి స్వస్థతా పరిచర్య శ్రీసభ ద్వారా కొనసాగించ అపోస్తలులను, శిష్యులను,నిన్ను,నన్ను యేసు పిలుస్తూ,ఈ ప్రేషిత కార్యమునందు పాలుపంచుకొనమని ఆహ్వానిస్తున్నాడు.యేసునందు, యేసుద్వారా,యేసుతో దేవుడు సృష్టికి మరింత మంచితనమును, శ్రేష్టత్వమును దయచేస్తూ,స్వయానా దేవుని రూపులో సృష్టించబడిన మనలను అటువంటి మంచితనమును ప్రపంచములో పంచుటకు, నెలకొల్పుటకు వారధులుగా ఉండమని కోరుచున్నారు.

మన అనుదిన జీవితములో విశ్వాసమును దృఢపరుచుకోవాలంటే,యేసుతో కలసి పడవలో ప్రయాణించాలి, సరస్సు ఆవలి తీరమునకు చేరాలి. శిష్యరికపు విలువలను నిండుగా పొంది, జీవించినచో, మనము చేయు కార్యముల ద్వారా ప్రజలు మనయందు యేసును గ్రహించి చూస్తారు. మన పిలుపును ఆధారముగా చేసుకొని ప్రామాణికముగా జీవించినచో పలుమార్లు మన కార్యముల ద్వారా యేసు ఉనికిని,పూర్తి స్వస్థతను పంచుటకు ఎన్నో అవకాశములు,సంధర్భములు మనకు లభించును.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN