భవిత దిద్దుకొనగ అడుగు వేయు!.

డా. కల్లూరి ఆనందరావు
07 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
వర్తమాన మందు వసియించు ప్రతివాడు
నేటి లోక రీతి తెలిసి మసలు!
గతము నేర్పినట్టి ఆత్మానుభవముతో
భవిత దిద్దుకొనగ అడుగు వేయు!.
