కనికరమును మన అనుదిన జీవిత కార్యముగా మార్చాలి

జోసెఫ్ అవినాష్

06 Feb 2026

సామాన్య 4వ శనివారం
1రాజులు 3:4-13
కీర్తన 119:9-14
మార్కు 6:30-34
ధ్యానం:
మార్కు సువార్తీకుడు యేసుని ప్రేమను, కనికరమును చాటి చెప్తూ,పేదల పట్ల యేసు చూపిన తండ్రి చొరవను తన పరిచర్యకు పునాదిగా చూపుచున్నాడు. ఆకలిగొన్న జన సమూహములను చూసి,యేసు కనికరముతో వారల మధ్య అద్భుత కార్యములను చేసెనని సువార్తీకులు పదే పదే ప్రస్తావించుట మనకు విధితమే. తండ్రి ప్రేమ కార్యమును నేరవేర్చుటలో,ప్రేషిత కార్యమును పరిపూర్తిగావించుటలో యేసు అమోఘమైన కనికరమును పంచుతూ,తన బోధనల ద్వారా మనకు తెలియచేసాడు.తద్వారా, అటువంటి సువార్త విలువలపై నిర్మింపబడిన కనికరమును మనము పాటించి జీవించినచో తండ్రి దేవుని ఆనందములో పాలుపంచుకొను భాగ్యమును పొందగలమని మనలను ఆహ్వానిస్తున్నాడు.మన అనుదిన జీవితములో ప్రేమను, కనికరమును పంచుటకు,

జీవించుటకు మనకు గల అవకాశములు కోకొల్లలు.దేవుడు తన కృప ద్వారా మనకు ప్రసాదించిన సకల మేలులకు కృతజ్ఞతగా, మనం దినదినము మరింత కనికరమును చూపుతూ జీవించినచో మన విశ్వాస జీవితము ఫలభరితమగును. మంచిని పంచుతూ మనకు ఒసగబడిన వరములను ఇతరులకు సహాయం చేయుటలో వాడుకొనినచో,స్వయానా యేసు పంచి, ప్రకటించిన కనికర కార్యములకు ఊతమిచ్చినవారమవుతాం. మనము నిద్రకు ఉపక్రమించక మునుపు దైనందిన కార్యములను పరీక్షించుకొని, ప్రేమ,కనికరమనెడి త్రాసు ద్వారా బేరీజు వేసికొనినచో మన ఆధ్యాత్మిక జీవితమునందు నిండైన పరిపక్యతను పొందగలము.మంచిని పంచుటయందు కనికరమును చాటుటలో మనము అనుభవించు సంతోషము కేవలము తండ్రి దేవుని కార్యము. అందువలన,మన విశ్వాస జీవిత ఫలములను పరిపూర్తిగా ఆస్వాదించాలంటే కనికరమును మన అనుదిన జీవిత కార్యముగా మార్చాలి.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN