ఫిబ్రవరి మాస ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
06 Feb 2026
విశ్వ కాపరి పోప్ లియో XIV ఫిబ్రవరి మాస ప్రార్థన ఉద్దేశాన్ని ప్రకటించారు.నయం కాని వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆయన పిలుపునిచ్చారు.బాధలో ఉన్న ప్రతి బిడ్డలో దేవుని ముఖాన్ని గుర్తించి,వారి పట్ల దయ,ప్రేమ,బాధ్యతతో స్పందించాలని పోప్ అన్నారు.అలాగే బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య సహాయం లభించాలని,వారి కుటుంబాల కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించాలని ఆయన సెలవిచ్చారు.
