మార్చిలో పోప్ తో భేటీ కానున్న కేరళ ముఖ్యమంత్రి

జోసెఫ్ అవినాష్

05 Feb 2026

కేరళ ముఖ్యమంత్రి పినారాయ్ విజయంకు వాటికన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.పోప్ లియో XIV ను మార్చి 4న రోమ్‌లో కలుసుకోవాలని ఆయనను ఆహ్వానించారు.ఈ ఆహ్వానం భారతదేశంలోని వాటికన్ అధికార ప్రతినిధి (అపోస్టాలిక్ నున్సియేచర్) ద్వారా పంపించారు.అధికారిక కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరగనుంది.కేరళ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు,సామాజిక అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముందని సమాచారం. ఈ భేటీకి రాజకీయ,దౌత్య పరంగా ప్రాముఖ్యత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN