భారతమిత్రం రచయిత డా. కల్లూరి ఆనందరావు గారికి ఘన సన్మానం

జోసెఫ్ అవినాష్
03 Feb 2026
"ఆచార్య దేవోభవ –పితృ దేవోభవ" అంటూ ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో డిప్యూటీ సెక్రటరీగా పని చేసి,పదవీ విరమణ చేసిన శ్రీ అప్పారావు గారు పండితులైన ముగ్గురికి సన్మానం చేయాలని సంకల్పించారు.వారిలో మన భారతమిత్రం రచయిత కవి,ఆంధ్రోపన్యాసకులు శ్రీ డా.కల్లూరి ఆనందరావు గారిని గుంటూరు కనక మేడల కన్వెన్షన్ హాలులో 03.02.2026 తేదీన ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకురాలు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు.డాక్టర్ కల్లూరి ఆనందరావు గారు మన భారతమిత్రం పత్రిక ద్వారా సమాజాన్ని మేల్కొలిపే రచనలు,పద్యాలతో విశేష సేవలందించారు.ఆనందరావు గారు తన పుస్తక రచనల ద్వారా సామాజిక చైతన్యానికి బాటలు వేశారు.ఇలాంటి మరెన్నో అర్థవంతమైన సాహిత్య సేవలు కొనసాగించాలని భారతమిత్రం యాజమాన్యం శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది.
