దైవాంకిత జీవితం ఘనమైనది - పోప్
జోసెఫ్ అవినాష్
03 Feb 2026
బాలయేసు ఆలయ సమర్పణ మహోత్సవం మరియు దైవాంకితుల దినోత్సవం సందర్భంగా,పునీత పేతురు మహాదేవాలయంలో విశ్వ కాపరి పోప్ లియో XIV దివ్యపూజాబలిని నిర్వహించారు.ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ,యేసుప్రభువును దేవాలయంలో సమర్పించిన సంఘటన దేవుని ప్రేమ మన జీవితాల్లోకి ప్రవేశించిన విధానాన్ని తెలియపరుస్తున్నదని చెప్పారు.దైవాంకిత జీవితాన్ని స్వీకరించిన గురువులు,కన్యాస్త్రీలు కష్టకాలాల్లో కూడా ప్రజలను వదలకుండా వారి మధ్యనే ఉండి సేవ చేస్తున్నారని పోప్ ప్రశంసించారు.యుద్ధాలు,హింస ఉన్న చోట్ల కూడా వారు భయపడకుండా నిలబడుతూ జీవితం విలువైనదన్న సందేశం ఇస్తున్నారని తెలిపారు.పేదలు,రోగులు,వృద్ధులు,యువత సేవలోనే దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుందన్నారు.ప్రపంచానికి ఆశ,శాంతి,వెలుగుగా దైవాంకిత జీవితం కొనసాగాలని పోప్ ఆకాంక్షించారు.
