ప్రారంభమైన గుణదలమాత నవదిన మహోత్సవ ప్రార్థనలు

జోసెఫ్ అవినాష్

02 Feb 2026

విజయవాడ పీఠం, గుణదల పుణ్యక్షేత్ర 102వ మహోత్సవాల నవదిన ప్రార్థనలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కతోలిక పీఠాధిపతి మహా ఘన.తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ,గురువులు ప్రధానాలయం వద్ద మేరీమాత పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పీఠ కాపరి రాజారావు గారు మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి 9,10,11 తేదీలలో గుణదల మాత ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. దేవాలయం దిగువన ఏర్పాటు చేసే ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలిపూజలు, స్వస్థత ప్రార్థనలు జరుగుతాయన్నారు.అనంతరం పలు విచారణల నుంచి వచ్చిన భక్తులు కొవ్వొత్తులు చేతపట్టి జపమాలతో కాలినడకన కొండ పైన మరియమాత స్వరూపం వద్దకు చేరుకున్నారు.అక్కడ సమష్టి దివ్యబలిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమంలో వికార్ జనరల్ ఎం. గాబ్రియేలు, ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కె.మరియన్న,సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ టి.సునీల్ రాజు,ఫాదర్ కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN