వార్త మాధ్యమాలు శాంతికి వంతెనలుగా నిలవాలి: పోప్

జోసెఫ్ అవినాష్

22 Jan 2026

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విభేదాలు, ద్వేష భావాల మధ్య కతోలిక సామాజిక మాధ్యమాలు శాంతి,సమాధాన స్వరాలను బలంగా వినిపించాలి అని వాటికన్ వేదికగా బుధవారం కతోలిక విలేకరులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.మీడియా ప్రసారం చేసే వార్తలు, కథనాలు మనుషుల హృదయాలను గాయపరచకుండా,ఆయుధాల్లా మారకుండా, ప్రేమ, సానుభూతి, నిజాయితీతో నిండివుండాలని ఆయన అన్నారు.మీడియా బడుగు బలహీన వర్గాలకు స్వరంగా మారి,వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని ఆయన కోరారు.మీడియా పని వార్తలు చెప్పడమే కాదు మనుషుల మధ్య ద్వేషాన్ని తగ్గించి,శాంతిని పెంపొందించడమే నిజమైన సేవ అని పోప్ గుర్తు చేశారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN