ఒప్పుకొనెడి వాడె గొప్ప వాడు!.

డా. కల్లూరి ఆనందరావు
06 Jan 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
కష్టపెడితి నిన్ను కరుణించు మనువాడు
కంటిపాప వోలె కడు హితుండు!
తప్పు లేనివాడు ధరణిలో కనరాడు
ఒప్పుకొనెడి వాడె గొప్ప వాడు!.
