ముగ్గురు జ్ఞానుల విశ్వాసాన్ని అనుసరిద్దాం - పోప్
జోసెఫ్ అవినాష్
06 Jan 2026
దేవుడు మన జీవితంలో ప్రత్యక్షమయ్యే క్షణం నుంచి ఇక ఏదీ మునుపటిలా ఉండదని,ఆయన సాన్నిధ్యం మన ఆలోచనలను,దారులను పూర్తిగా మార్చివేస్తుందని ముగ్గురు జ్ఞానుల పండుగ సందర్భంగా పునీత పేతురు మహాదేవాలయ ఆవరణలో నిర్వహించిన పండుగ పూజలో పోప్ లియో XIV ఈ వ్యాఖ్యలు చేశారు.తన సందేశంలో పోప్, సువార్తలోని ముగ్గురు జ్ఞానుల విశ్వాసం గురించి ప్రస్తావించారు.దేవుని వెలుగును చూశాక ఆనందంతో ప్రయాణం చేసిన జ్ఞానులు ఒకవైపు ఉంటే,అదే దేవుని ప్రత్యక్షతను భయంతో,అసూయతో ఎదుర్కొన్న హెరోదు మరోవైపు కనిపిస్తాడని ఆయన చెప్పారు.దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మన హృదయం ఎలా స్పందిస్తుందో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన హెచ్చరించారు.
