నేటి పునీతుడు - పునీత ఆల్ ఫ్రెడ్ బెసెట్

ఫాదర్ ఆకుల ప్రసాద్
05 Jan 2026
ఆల్ ఫ్రేడ్ బెసెట్ గారు కెనడాలోని మౌంన్ట్ సెయింట్ గ్రెగోయిర్ నందు 1845 ఆగష్టు 9న జన్మించారు.చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆల్ ఫ్రేడ్ బెసెట్ గారు అనేక చోట్ల పని చేశారు.25 సం!రాల వయస్సులో పవిత్ర శిలువ సభలో చేరుటకు ప్రయత్నించి విఫలమై తిరిగి బిషప్ బౌర్గెట్ సహాయంతో సభలో చేరి శాశ్వత బ్రదర్ గా మాటపట్టు స్వీకరించారు.నోట్రేడామ్ కాలేజ్ నందు ద్వారపాలకునిగా, సాక్రిస్టియన్ గా పనిచేసిన ఆల్ ఫ్రేడ్ బెసెట్ గారు తన గది కిటికీకి అతిచేరువలో మౌంట్ రాయల్ కొండపైనున్న పునీత జోజప్పగారి స్వరూపాన్ని చూస్తూ రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు.పునీత జోజప్ప గారి యెడల అపార భక్తివిశ్వాసం కలిగిన వీరు ఎదోఒకనాడు ఆ కొండ పై పునీత జోజప్ప గారు ఘనంగా గౌరవింపబడాలని తలంచేవాడు.ప్రత్యేక స్వస్థతా వరం కలిగిన ఆల్ ఫ్రెడ్ బెసెట్ గారు పవిత్ర తైలంతో రోగులను స్వస్థత పరిచేవారు.ఆయన పేరు చుట్టుప్రక్కల వ్యాపించగా వేలసంఖ్యలో రోగులు ఆయనచెంతకు వచ్చేవారు.తనచెంతకు వచ్చే వారితో "నేను కాదు పునీత జోజప్పగారు స్వస్థపరుస్తున్నాడు" అని పదేపదే చెప్పేవాడు. తను మరణించేనాటికి ప్రతిసంవత్సరం 80000 వేల ఉత్తరాలు రోగులనుండి ఆయనకు వచ్చేవి.పునీత ఆల్ ఫ్రేడ్ బెసెట్ గారు తలంచినట్లే దేవుడు మౌంట్ రాయల్ నందు జోజప్పగారి దేవాలయం వెలయునట్లు చేశాడు.అచ్చటనే పునీత ఆల్ ఫ్రేడ్ బెసెట్ గారు తన సువార్తా స్వస్థతా సేవను కొనసాగించారు. వీరు 1937 జనవరి 6న మరణించగా,2010 అక్టోబర్ 17న 16వ బెనెడిక్టు పోపుగారు పునీత ఆల్ ఫ్రెడ్ బెసెట్ గారిని పునీతులుగా ప్రకటించారు.
