క్రిస్మస్ ఆనందం మన జీవితాలకు బలంగా మారాలి -పోప్
జోసెఫ్ అవినాష్
05 Jan 2026
క్రిస్మస్ పండుగ ఇచ్చే ఆనందం కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం కాకుండా,అది మన ప్రతిరోజూ జీవన ప్రయాణానికి శక్తిగా మారాలని ఆదివారం తాను అందించిన సువిశేష సందేశంలో పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా పోప్ యోహాను సువార్తలోని “వాక్యము శరీరమై మన మధ్య నివసించెను” అనే వాక్యాన్ని గుర్తు చేస్తూ,దేవుడు మనిషిగా మారి మన మధ్యకు రావడమే క్రైస్తవ విశ్వాసానికి అసలైన పునాది అని అన్నారు.నిజమైన ఆరాధన అంటే దేవాలయ గోడల మధ్య మాత్రమే పరిమితం కాకుండా, బాధపడుతున్నవారిని ఆదుకోవడం,అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం, ప్రతి మనిషిలో దేవుని ముఖాన్ని గుర్తించడం అని పోప్ తెలిపారు.దేవుణ్ణి ప్రేమించడమూ,మనిషిని సేవించడమూ విడదీయరాని అంశాలని ఆయన హితవు పలికారు.
