నేటి పునీతుడు - పునీత జాన్ న్యూమన్

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
04 Jan 2026
పునీత జాన్ న్యూమన్ గారు చెకోస్లేవేకియా లోని ప్రచాటిటు నందు క్రీ.శ.18|| న జన్మించారు.విశ్వాస, భక్తిప్రవత్తులు కలిగిన న్యూమన్ గారిని ఆయన తల్లి "నా చిన్నారి బైబిల్ జీవి" అని ముద్దుగా పిలిచేది.ఏకసంధ్యాగ్రహి మరియు అనేక భాషలలో దిట్టయైన న్యూమన్ గారు అనారోగ్యం వలన గురుపట్టం పొందలేక అమెరికా వెళ్ళి న్యూయార్క్ నందు బిషప్ జాన్ గారి హస్తాలమీదుగా క్రీ.శ.1836లో గురువుగా అభిషేకం పొందారు.మేత్రాసణ గురువుగా కంటే ఒక సభ గురువుగా అధిక సువార్త సేవ చేయు నిమిత్తం పునీత అల్ఫోన్సు లిగోరి స్థాపించిన రెడంస్టొరిస్టు సభలో చేరి తాను కోరుకున్న అవిశ్రాంత ఆధ్యాత్మిక ప్రచారం ముమ్మరం చేశారు.అనేక ప్రాంతాలలో సువార్త ప్రచారం సాగించి అనేక ఎత్తైన గోపురాలు కల్గిన సుందర దేవాలయాలు నిర్మించి,పాఠశాలలను, యువజన సంఘాలను స్థాపించాడు.రెడంస్టొరిస్టు సభ ఉపమఠాధిపతిగా సభ ఉన్నతికి విశేషకృషిచేశారు. వీరు వ్రాసిన సత్యోపదేశ గ్రంధం అమెరికా బిషప్పుల ప్లీనరీ నందు ఆమోదింపబడింది.వీరి కృషిని గుర్తించి పోపుగారు న్యూమన్ గారిని ఫిలడేల్ఫియా పీఠాధిపతిగా నియమించారు.వందకు పైగా పాఠశాలలను నెలకోల్పి"కతోలిక పాఠశాలల విద్యా విధాన పితామహుడు"గా పేరొందారు.దివ్యసత్ప్రసాదం ఎడల, తల్లి మరియ ఎడల అపార భక్తికలిగిన వీరు 1860 జనవరి 5న గుండెపోటుతో మరణించారు.వీరి ద్వారా అనేక స్వస్థతలు జరిగాయి.1977 జూన్ 19న 6వ పౌల్ పోపుగారు జాన్ న్యూమన్ గారిని పునీతులుగా ప్రకటించారు.అమెరికాలో పునీతుడైన తొలి పురుషపుంగవుడు వీరే.
పునీత జాన్ న్యూమన్ గారా మాకొరకు ప్రార్థించండి!
