కతోలిక భాషలో IHS అంటే ఏంటి?

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్

04 Jan 2026

ఈ మూడు అక్షరాలు గురించి వివిధ వివరణలున్నాయి."యేసు" అనే పేరును గ్రీకు భాషలో ఇలా వ్రాస్తారు: Ιησούς(=Jesus) ఈ అక్షరాలలోని మొదటి మూడు అక్షరాలు తీసుకుంటే ఈ సంజ్ఞ వస్తుంది. I-iota H-eta; £-sigma. కొన్నిసార్లు దీనినే లతీయ భాషలోని అక్షరాలతో IHS లేక IHC అని కూడా వ్రాస్తారు.ఇది యేసు పేరుకు గుర్తు,

మరి కొందరి అభిప్రాయం ప్రకారం ఈ మూడు అక్షరాలు లతీయ భాషలోనే పదబంధానికి గుర్తు అని తెలుస్తోంది.అవి Iesus Hominum Salvator (Jesus Saviour of Men), అనగా యేసు, మనుష్యుల రక్షకుడు అని అర్థం. ఈ చిహ్నానికి చారిత్రక నేపథ్యం వుంది. కాన్ స్టంటైన్ అనే రోమను చక్రవర్తి యుద్ధ సమయంలో ఒక రాత్రి ఆయనకు నిద్రపట్టలేదు. శత్రువులు జయించేట్టున్నారు. కొంచెం కళ్ళు మూసేసరికి అతనికొక కల వచ్చింది.ఆ కలలో ఒక నిలువు గుర్తు, దానిపై కొన్ని అక్షరాలు కనుపించాయి. అవి "In Hoc Signe Vinces" (in this sign you shall conquer). ఈ సంజ్ఞకు అర్థం, "ఈ చిహ్నం మీద నీవు విజయం సాధిస్తావు" అని. అంతే! ప్రొద్దున్నే తన సైనికులందరినీ ఈ గుర్తు గల జెండాలతో యుద్ధానికి సిద్ధం చేశాడు. కలలో సూచించినట్లే విజయం సాధించాడు. అప్పటి నుండి ఈ గుర్తును క్రైస్తవ విజయానికి చిహ్నంగా భావిస్తారు.

ఈ రెండు వివరణలోనూ ఇది క్రీస్తుకు సంబంధించిన సత్యచిహ్నమని గుర్తించాలి. యేసుక్రీస్తు రక్షణకార్యాన్ని సూచించే ఈ చిహ్నం దివ్యసత్ప్రసాద అప్పం మీద ప్రముఖంగా కనుపించడం గమనిస్తాం.అలాగే గుడిలో పలుచోట్ల ఈ అక్షరాలు కనుపిస్తాయి. దివ్యసత్ప్రసాద అప్పం మీద కనుపించే (IHS) ఈ అక్షరాల అర్థం, - యేసుక్రీస్తు, మనుషుల రక్షకుడు అనే భావానికి సరిగ్గా సరిపోతుంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN