ముగ్గురు రాజుల పండుగ సందర్భంగా

డా. కల్లూరి ఆనందరావు
03 Jan 2026
దైవ జ్ఞానులయిన దేశాధినేతలు
విశ్వ ప్రభుని జూడ వెడలినారు!
అవనిలోని జనుల కావగా పుట్టిన
మరియ సుతునిగొలిచి మరలినారు!
పసిడి తోడ నొకరు! పరిమళ ద్రవ్యమ్ము
మరియొకరు ప్రభునకు యర్పణనిడ!
సర్వ లోక విభుని సాంబ్రాణినర్పించి
భక్తితో త్రయమ్ము ప్రణతులిడిరి!
