క్రిస్మస్ తాత నుండి బహుమతిని అందుకున్న పోప్

జోసెఫ్ అవినాష్
13 Dec 2025
డిసెంబర్6, క్రిస్మస్ తాత పండుగ సందర్భంగా వాటికన్ లో పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ క్రిస్మస్ తాత వేషధారణలో వాటికన్ ఆవరణలో తిరుగుతూ,తనకి కంటబడిన వారికి చిన్న చిన్న బహుమతులు ఇస్తూ ముందుకు నడవసాగాడు. అనంతరం విశ్వకాపరి పోప్ లియో XIV గారిని కలిసి ఆయనకు ఒక ఆత్మీయమైన బహుమతి అందజేసి, శుభాకాంక్షలు తెలిపాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.శ్రీసభ పునీతుడు పునీత నికోలస్ గారి స్మరణను మనం క్రిస్మస్ తాత మహోత్సవంగా జరుపుకుంటాం.ఈయన ఒక పీఠాధిపతి దొంగచాటుగా పేదలకు సహాయం చేసే ఉదారతకు ప్రసిద్ధుడు.ఆయన ఉదారతే నేడు “క్రిస్మస్ తండ్రి” లేదా “సాంటా క్లాజ్” అనే రూపంలో మనం చూస్తున్న ప్రియమైన పాత్రగా మారింది.
