క్రిస్మస్ తాత పండుగ

బ్రదర్ ఆంటోనీ నాగిపోగు

05 Dec 2025

డిసెంబర్ అనగానే క్రీస్తు జయంతితో పాటు ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది శాంతాక్లాజ్ అనబడే క్రిస్మస్ తాత.ఎర్రని దుస్తులు,ఎర్రని కుచ్చు టోపి దుస్తులలోని చాకోలెట్స్, బహుమానాలు,నాటకాలు ఇలా క్రిస్మస్ పండుగలో ముఖముపై చిరునవ్వు, మనసులోని చిరునవ్వు, ఎక్కడ లేని ఆనందం.వర్ణించలేని, అదుపులేని ఉత్సాహం ఈ పునీతుని సొంతం.

వివిధ దేశాలలో వివిధ రకాలుగా పిలవబడుతున్న ఈ శాంతాక్లాజ్ పండుగ డిసెంబర్ 6న ఘనంగా జరుపుకుంటారు. కాని శాంతాక్లాజ్ పండుగకు మన క్రిస్టమస్ కు ఎటువంటి సంబంధం లేదు. శాంతాక్లాజ్కు క్రీస్తుకు సంబంధం లేదు. అవి రెండు వేరే.ఏ మాత్రం పోలికలు లేవు. ఈయనకు 130 పేర్లు వున్నాయి అంటే నమ్మగలరా? ఈయనకు క్రిస్మస్కు సంబంధం లేదు అయినా ఎందుకు క్రిస్మస్ సీజన్లో ఈయన పేరు హల్ చల్ అవుతుందీ అంటే, డిసెంబర్ 6 శాంతాక్లాజ్ రోజు జరుగుతుంది. డిసెంబర్ 5, 6, 19లలో ఈయన పండుగ జరుగుతుంది.ఇలా క్రిస్మస్ నెలలో ఉండటం వలన ఈ రెండు కలిసిపోయాయి.

పునీత నికోలస్ క్రీ.శ. 270 మార్చి 15న తీసియాలోని పాతర (patara) అను ప్రాంతంలో జన్మించాడు. లీసియా ఆసియా మైనర్ రాష్ట్రాలలో ఒకటి. సముద్రతీరానికి దగ్గరలో వున్న మీరా (myra) రాజధాని నగరం, గురుమండల పీఠం, తల్లిదండ్రులు ధనవంతులు, భక్తులు, గొప్పవారు, వారు దైవభక్తులు కావటంతో, పునీత నికోలస్ బరి గారు కూడా దైవభక్తిలో ప్రముఖులు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన తన అంకుల్ దగ్గర పెరిగారు. ధనం ఎంతో వున్నా, ఐశ్వర్యం వున్నా, సుఖ జీవనానికి బంధీ అయ్యేవాడు కాదు. లేని వారికి ఇచ్చేవాడు, అవసరతలో ఉన్నవారికి సహాయం చేసేవాడు, చిన్న పిల్లలను ఆదరించి ప్రేమించే వాడు. దేవుని సువార్తను ప్రకటిస్తూ, ప్రతి వారికి సహకరించే వాడు కొంత కాలానికే మైరా పీఠాధిపతి మరణించటంతో,పీఠాధిపతిగా అభిషేకించబడ్డారు.

డయాగ్లిసియన్ వేదహింసల సమయంలో నికోలస్ బరి గారు జైలు శిక్షను అనుభవించారు. ఎన్నో విపరీతమైన బాధలకు గుర య్యాడు. దేవుని ప్రార్ధన సహాయంతో కాన్స్టాంట్ రాజు అవడంతో ఆయనకు విడుదల అయ్యారు. క్రీ.325వ సం॥లో జరిగిన నైసియ సమావేశానికి ఆయన హాజరయ్యారు. దానికి ఆధారాలు కూడా వున్నాయి.నికోలస్ బరి గారు అరియానిజంను ఖండించాడు.అరియానిజం అంటే యేసుక్రీస్తు త్రిత్వంలోని ఒక వ్యక్తి అని అంగీకరించని సిద్ధాంతాన్ని గట్టిగ ఖండించాడు. అక్కడ ఆ సమావేశంలో ఒక పీఠాధిపతి కొట్టినందుకని, తప్పుగా ఆరియానిజంను వాదించినందుకు ప్రతిఫలంగా ఆయనను జైలులో వేసారని, అక్కడ పునీత నికోలస్ బరి గారికి మరియతల్లి ప్రత్యక్షమైంది అంటారు.

నికోలస్ గారు లేని వారికి ఇస్తూ, పేదవారికి అండగా నిలుస్తూ, పేదలలో సంతోషాన్ని చూసేవాడు. అందరికి అండగా, దగ్గరగా, అందరూ బాగుండాలి అందరూ సంతోషంతో వుండాలని కోరుకోవడం ఆయన స్వభావం. ప్రార్ధన ద్వారా ఏమైనా సాధించవచ్చు, జయించవచ్చు అని తన జీవనశైలి ద్వారా చెప్పాడు. తాను దరిద్రుడై ఇతరులను ధనవంతులుగా చేసాడు. సేవే సర్వం, పరిచర్య ప్రాముఖ్యం అని ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచాడు.క్రీ.శ. 343న పునీత నికోలన్ బరి గారు.చనిపోయారు. మీరా క్రైస్తవులు ఆయన
మరణం తర్వాత ఆయన జ్ఞాపకాలను సజీవంగా నిలుపుతూ ఆయన వర్ధంతి రోజున ఆశ్చర్యం గొలిపే బహుమతులను ఇచ్చేవారు..

ఆ ఆచారం కాలక్రమేణా క్రీస్తు జయంతి పండుగకు పాకింది. ఈ పునీతుడే మనం చూసే క్రిస్మస్ తాత. పునీత నికోలస్ అస్తికలు దక్షిణ ఇటలీలోని బరికి తీసుకుని వచ్చారు. ఈనాటికి అవి స్పష్టత శక్తిని కలిగి వున్నాయి.అమితంగా గౌరవింపబడుతున్నాయి. ఈయన పిల్లలకు,అమాయకులకు,రష్యా, గ్రీసు,సిసిలి, లారేన్, లిరిమేక్, నెపుల్స్ దేశాలకు పాలక పునీతుడు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN